Blue Origin : అంతరిక్షానికి వెళ్ళినా ఆగని వేధింపులు.. కన్నీళ్ళు పెట్టుకున్న వ్యోమగామి

అంతరిక్షానికి వెళ్ళిన ఓ వ్యోమగామి మీద కొందరు తీవ్ర బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-11-27 13:51 GMT

దిశ, వెబ్ డెస్క్ : అంతరిక్షానికి వెళ్ళిన ఓ వ్యోమగామి మీద కొందరు తీవ్ర బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. యాత్ర ముగించుకొని వచ్చిన ఆస్ట్రోనాట్ ఆ కామెంట్స్ చూసి కన్నీళ్ళు పెట్టుకుంది. జెఫ్ బెజోస్(Jeff Bejos) కు చెందిన 'బ్లూ ఆరిజిన్'(Blue Origin) ద్వారా అంతరిక్ష యాత్రకు వెళ్ళిన ఆస్ట్రోనాట్ ఎమిలీ కాలండ్రెల్లీ(Emily Callandrelli).. అక్కడి ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. "అంతరిక్షంలో భారరహిత స్థితిలో ఉండి భూమిని చూడటం.. నాకు పిల్లలు పుట్టినప్పటి లాంటి అనుభూతికి లోనయ్యాను. చాలా ఆనందం వేసింది" అని రాసుకొచ్చింది. దీనిపై కొందరు నెటిజన్లు..కాలండ్రెల్లీని బాడీ షేమింగ్ చేస్తూ పోస్టులు పెట్టారు. ఆ కామెంట్లను, పోస్టులను చూసి కాలండ్రెల్లీ కన్నీళ్ళు పెట్టుకున్నారు. నారో మైండ్ కలిగిన పురుషులను పట్టించుకునే సమయం లేదని గట్టిగా బదులు చెప్పారు. మహిళలను భూమి మీదనే కాదు అంతరిక్షానికి వెళ్ళినా వేధింపులకు గురి చేయకుండా వదలరు అనేదానికి దీనిని ఉదాహరణగా తీసుకోవాలి.     

Tags:    

Similar News