Fengal Cyclone : ఫెంగల్ తుఫాన్ ఎఫెక్ట్.. తమిళనాడులో విద్యాసంస్థలకు సెలవులు
ఫెంగల్ తుఫాన్(Fengal Cyclone) ప్రభావంతో తమిళనాడు(Tamilanadu)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
దిశ, వెబ్ డెస్క్ : ఫెంగల్ తుఫాన్(Fengal Cyclone) ప్రభావంతో తమిళనాడు(Tamilanadu)లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా కడలూరు, మైలాడుదురై, తిరువారూర్‌లో కుండపోత వానలు పడుతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలతో చెన్నై(Chennai) సహా 9 జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. నాగపట్నం జిల్లాలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. పుదుచ్చేరిలోని కారైకాల్ జిల్లాకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా చెన్నైతో పాటు 12 తీరప్రాంత జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాన్ ఎఫెక్ట్ తో మరో 48 గంటల పాటు తమిళనాడులో అతిభారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.