Ashish Deshmukh: కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలి.. ఆశిశ్ దేశ్‌ముఖ్
మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని, కాబట్టి ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కాషాయ పార్టీలో చేరాలని బీజేపీ ఎమ్మెల్యే ఆశిశ్ దేశ్‌ముఖ్ అన్నారు.
దిశ, నేషనల్ బ్యూరో: మహారాష్ట్రలో కాంగ్రెస్‌కు భవిష్యత్ లేదని, కాబట్టి ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా కాషాయ పార్టీలో చేరాలని బీజేపీ ఎమ్మెల్యే ఆశిశ్ దేశ్‌ముఖ్ (Aashish desh much) అన్నారు. బుధవారం ఆయన నాగ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడారు. ‘మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించింది. కాంగ్రెస్ దారుణ వైఫల్యాన్ని చూశాం. ఇది ప్రతిచోటా జరుగుతోంది. ప్రతి రాష్ట్రంలోనూ సీట్లు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రజలు కాంగ్రెస్‌కు ఏ విధమైన ఆప్షన్‌ను ఇవ్వడం లేదు. ఈ ఫలితం హస్తం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అందులోనే ఉంటే భవిష్యత్తు లేదు. కాబట్టి మహారాష్ట్రలో ఇటీవల గెలిచిన ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరాలి’ అని వ్యాఖ్యానించారు. లోక్‌సభకు అత్యధికంగా 48 మంది సభ్యులతో రెండో స్థానంలో ఉన్న మహారాష్ట్రలో కాంగ్రెస్ 16 సీట్లు మాత్రమే గెలుచుకుందని తెలిపారు. కాంగ్రెస్‌కు అసెంబ్లీలో 10 శాతం కంటే తక్కువ ప్రాతినిధ్యం ఉన్న 17వ రాష్ట్రంగా మహారాష్ట్ర ఉందని చెప్పారు. కాగా, దేశ్ ముఖ్‌ను కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయగా బీజేపీలో చేరిన ఆయన ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సావ్నర్ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.