Sabal 20 : భారత ఆర్మీ చేతికి ‘సబల్ 20’

దిశ, నేషనల్ బ్యూరో : ‘సబల్ 20’(Sabal 20) అనే మానవరహిత ఎలక్ట్రిక్ హెలికాప్టర్(Unmanned Helicopter) భారత ఆర్మీ(Indian Army)కి అందుబాటులోకి వచ్చింది.

Update: 2024-11-27 15:23 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘సబల్ 20’(Sabal 20) అనే మానవరహిత ఎలక్ట్రిక్ హెలికాప్టర్(Unmanned Helicopter) భారత ఆర్మీ(Indian Army)కి అందుబాటులోకి వచ్చింది. కొండలు, లోయలు, అడవులు ఉన్న ప్రాంతాలకు సైనిక సామగ్రి, పేలుడు పదార్థాలు, ఆయుధాల తరలింపు అవసరాల కోసం దీన్ని వినియోగించనున్నారు. 20 కేజీల వరకు పేలోడ్‌ను ఇది మోసుకెళ్లగలదు.

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ‘ఎండ్యూర్ ఎయిర్’ కంపెనీ ‘సబల్ 20’ని తయారు చేసింది. శత్రువుల కంటికి చిక్కకుండా అత్యంత ఎత్తు నుంచి ఎగిరే కెపాసిటీ దీని సొంతం. ఈ హెలికాప్టర్ రెక్కలు తిరిగే వేగం చాలా తక్కువ. దీనివల్ల ప్రయాణ సమయంలో సబల్ 20 నుంచి తక్కువ శబ్దం వెలువడుతుంది. ఎత్తులో ఎగరడం, శబ్దం తక్కువగా ఉండటంతో శత్రువులు దీన్ని గుర్తించే అవకాశాలు తగ్గుతాయి.

Tags:    

Similar News