కోహ్లీ డకౌట్‌పై పోలీసులు వినూత్న ట్వీట్.. ఆ తర్వాత డిలీట్
దిశ, వెబ్‌డెస్క్: శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే దీనికి ఉత్తరాఖాండ్ ట్రాఫిక్ పోలీసులు తమ ప్రచారానికి వాడుకున్నారు. కోహ్లీ డకౌట్ అవుతూ నిరాశతో పెవిలియన్‌కి చేరుతున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఉత్తరాఖాండ్ పోలీసులు…. కోహ్లీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. ‘హెల్మెట్ ఒక్కటే సరిపోదు. పూర్తి ధ్యాసతో డ్రైవింగ్ చేయడం కూడా అత్యంత ముఖ్యం. లేకపోతే కోహ్లీ లాగా మీరూ […]
దిశ, వెబ్‌డెస్క్: శుక్రవారం ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ డకౌట్ కావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే దీనికి ఉత్తరాఖాండ్ ట్రాఫిక్ పోలీసులు తమ ప్రచారానికి వాడుకున్నారు. కోహ్లీ డకౌట్ అవుతూ నిరాశతో పెవిలియన్‌కి చేరుతున్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేసిన ఉత్తరాఖాండ్ పోలీసులు…. కోహ్లీని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు.
‘హెల్మెట్ ఒక్కటే సరిపోదు. పూర్తి ధ్యాసతో డ్రైవింగ్ చేయడం కూడా అత్యంత ముఖ్యం. లేకపోతే కోహ్లీ లాగా మీరూ డకౌట్ అవుతారు’ అంటూ ట్వీట్ చేశారు.
అయితే ఈ పోస్ట్‌పై కోహ్లీ అభిమానులు విమర్శలు కురిపించారు. వాహనదారులకు అవగాహన కల్పించాలంటే వేరే విధంగా అవగాహన కల్పించవచ్చని, కానీ ఇలా కోహ్లీని కించపరుస్తూ పోస్ట్ పెట్టడం సరికాదని అభిమానులు ఆ పోస్ట్‌కు రిప్లైలు ఇచ్చారు. దీంతో అభిమానుల ఆగ్రహంతో చివరికి ఉత్తరాఖండ్ ట్రాఫిక్ పోలీసులు ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు.