ఎట్టకేలకు.. బాగ్రమ్‌ను వీడిన యూఎస్ ట్రూప్స్

కాబుల్: అఫ్ఘనిస్థాన్‌లోని అతిపెద్ద ఎయిర్ బేస్‌ బాగ్రమ్‌ను అమెరికా, నాటో దళాలు వీడాయి. తాలిబన్లు, అల్-ఖైదాతో సుదీర్ఘ యుద్ధం సమయంలో యూఎస్ వాయు దళాలు బాగ్రమ్‌ నుంచే కీలకమైన కార్యకలాపాలను సాగించేవి. అయితే, బాగ్రమ్ ఎయిర్ బేస్‌ను యూఎస్ దళాలు వీడినప్పటికీ, ఈ ప్రాంతాన్ని తమకు అధికారికంగా అప్పగించలేదని అఫ్గాన్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, యూఎస్‌కు తాలిబన్లకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. అమెరికా సైన్యం, నాటో ట్రూపులు పలు దఫాలుగా అఫ్గాన్‌‌ను విడిచి వెళ్తున్నాయి. […]

Update: 2021-07-02 04:32 GMT

కాబుల్: అఫ్ఘనిస్థాన్‌లోని అతిపెద్ద ఎయిర్ బేస్‌ బాగ్రమ్‌ను అమెరికా, నాటో దళాలు వీడాయి. తాలిబన్లు, అల్-ఖైదాతో సుదీర్ఘ యుద్ధం సమయంలో యూఎస్ వాయు దళాలు బాగ్రమ్‌ నుంచే కీలకమైన కార్యకలాపాలను సాగించేవి. అయితే, బాగ్రమ్ ఎయిర్ బేస్‌ను యూఎస్ దళాలు వీడినప్పటికీ, ఈ ప్రాంతాన్ని తమకు అధికారికంగా అప్పగించలేదని అఫ్గాన్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, యూఎస్‌కు తాలిబన్లకు మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. అమెరికా సైన్యం, నాటో ట్రూపులు పలు దఫాలుగా అఫ్గాన్‌‌ను విడిచి వెళ్తున్నాయి. ఇందులో భాగంగానే తాజాగా కీలకమైన బాగ్రమ్ ఎయిర్ బేస్‌ను వీడాయి. ఈ చర్యతో రెండు దశాబ్దాలపాటు తుపాకుల మోత, బాంబు పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లిన బాగ్రమ్‌కు విముక్తి కలగనుంది. సెప్టెంబర్ 11 వరకు అఫ్గాన్ నుంచి అమెరికా బలగాలన్నీ వెనక్కి వస్తాయని యూఎస్ ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News