ఒలింపిక్స్ నిర్వహించడం నాకిష్టం లేదబ్బా: ట్రంప్

త్వరలో జపాన్‌లో జరగనున్న ఒలింపిక్స్‌ పోటీలను వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు. వచ్చే ఏడాది నిర్వహించాలన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇతర దేశాల నుంచి ప్రేక్షకులు వచ్చే పరిస్థితి ఉండదని, ఒకవేళా పోటీలు నిర్వహించినా ఖాళీ స్టేడియాలే దర్శనమిస్తాయన్నారు. ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు రద్దయ్యాయని గుర్తు చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థిత్తుల్లో ఈ మెగా ఈవెంట్ నిర్వహించడం తనకు ఇష్టం లేదని ట్రంప్ వ్యాఖ్యానించాడు. అయితే ఎట్టి పరిస్థిత్తులో ఒలింపిక్స్ […]

Update: 2020-03-13 02:35 GMT

త్వరలో జపాన్‌లో జరగనున్న ఒలింపిక్స్‌ పోటీలను వాయిదా వేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కోరారు. వచ్చే ఏడాది నిర్వహించాలన్నారు. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ఇతర దేశాల నుంచి ప్రేక్షకులు వచ్చే పరిస్థితి ఉండదని, ఒకవేళా పోటీలు నిర్వహించినా ఖాళీ స్టేడియాలే దర్శనమిస్తాయన్నారు. ఇప్పటికే పలు క్రీడా టోర్నీలు రద్దయ్యాయని గుర్తు చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థిత్తుల్లో ఈ మెగా ఈవెంట్ నిర్వహించడం తనకు ఇష్టం లేదని ట్రంప్ వ్యాఖ్యానించాడు.
అయితే ఎట్టి పరిస్థిత్తులో ఒలింపిక్స్ పోటీలను ఆపే ప్రసక్తే లేదని, షెడ్యూల్ ప్రకారం ఈ మెగా ఈవెంట్ జరుగుతుందని టోక్యో గవర్నర్ యూరికో కొయ్యే గతంలోనే స్పష్టం చేశారు.

tag; olympic, us president, trump, world news

Tags:    

Similar News