కిమ్ గురించి తెలుసు.. కానీ చెప్పను: ట్రంప్
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై రోజు రోజుకు పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరోసారి స్పందించారు. కిమ్ ఆరోగ్య పరిస్థితిపై తమ దగ్గర నిర్దిష్టమైన సమాచారం ఉందన్నారు. ఈ మేరకు ట్రంప్ సోమవారం రాత్రి వైట్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే కిమ్ ఆరోగ్యంపై ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత కంటే ఎక్కవ మాట్లాడబోనని ట్రంప్ స్పష్టం చేశారు. ‘‘ […]
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై రోజు రోజుకు పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా మరోసారి స్పందించారు. కిమ్ ఆరోగ్య పరిస్థితిపై తమ దగ్గర నిర్దిష్టమైన సమాచారం ఉందన్నారు. ఈ మేరకు ట్రంప్ సోమవారం రాత్రి వైట్ హౌస్‌లో విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే కిమ్ ఆరోగ్యంపై ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత కంటే ఎక్కవ మాట్లాడబోనని ట్రంప్ స్పష్టం చేశారు.
‘‘ కిమ్‌తో నాకు మంచి సంబంధాలున్నాయి. అమెరికాకు నేను అధ్యక్షుడిని కాకపోయి ఉంటే ఉత్తర కొరియాతో యుద్ధం ఖచ్చితంగా చేయాల్సి వచ్చేది. కిమ్ కూడా అదే కోరుకున్నాడు. ఈ విషయాన్ని నేను బల్లగుద్ది చెప్పగలను. ప్రస్తుతం కిమ్ ఆరోగ్య పరిస్థితి నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఏం మాట్లాడలేను. అన్ని విషయాలు త్వరలో తెలుస్తాయి.’’ అని ట్రంప్ అన్నారు. గతంలో కిమ్‌ను రెండుసార్లు కలిసి అణ్వాయుధాల నిరోధానికి ఒప్పించానని ట్రంప్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కాగా, ఏప్రిల్ 15న, కిమ్ తాత, ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాల్లో పాల్గొనలేదు. అప్పటి నుంచి అతని ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే.
Tags: america president, trump, kim, north korea, health issue, white house, washington