గుడ్‌న్యూస్: ఆ మ్యాచ్‌లో వందశాతం ప్రేక్షకులకు అనుమతి
దిశ, స్పోర్ట్స్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌కు ఈసారి 100 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా కారణంగా పలు క్రీడా స్టేడియంలకు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లకు పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రేక్షకులను అనుమతించారు. గత ఏడాది యూఎస్ ఓపెన్ ఖాళీ స్టేడియంలోనే నిర్వహించారు. అయితే ప్రస్తుతం అమెరికాలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు సడలించారు. ఈ ఏడాది అగస్టు 30 […]
దిశ, స్పోర్ట్స్: యూఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌కు ఈసారి 100 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కరోనా మహమ్మారి కారణంగా కారణంగా పలు క్రీడా స్టేడియంలకు పూర్తి స్థాయిలో ప్రేక్షకులను అనుమతించడం లేదు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లకు పరిమిత సంఖ్యలో మాత్రమే ప్రేక్షకులను అనుమతించారు. గత ఏడాది యూఎస్ ఓపెన్ ఖాళీ స్టేడియంలోనే నిర్వహించారు. అయితే ప్రస్తుతం అమెరికాలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలు సడలించారు. ఈ ఏడాది అగస్టు 30 నుంచి సెప్టెంబర్ 12 వరకు యూఎస్ ఓపెన్ న్యూయార్క్‌లోని ఫ్లషింగ్ మెడోస్‌లో నిర్వహించనున్నారు. ప్రతీ మ్యాచ్‌కు 100 శాతం టికెట్లు అమ్మనున్నట్లు తెలుస్తున్నది. 2019లో జరిగిన యూఎస్ ఓపెన్‌కు 7 లక్షల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. ఈ సారి కూడా అంత మొత్తంలోనే టికెట్లు అమ్ముడు అవుతాయని నిర్వాహకులు భావిస్తున్నారు.