యూరప్ ప్రయాణికులపై అమెరికాలో నిషేధం
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో అమెరికా, భారత్ ముందస్తు చర్యలు చేపట్టాయి. యూరప్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ నిషేధం నేటి నుంచి 30 రోజుల పాటు అమలులో ఉంటుందని వైట్ హౌస్ ప్రకటించింది. యూరప్ లోని యూకే, ఇటలీలో వైరస్ విజృంభిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ తెలిపారు. ఇండియా కూడా గతంలో జారీ చేసిన టూరిస్ట్ వీసాలను రద్దు చేస్తున్నట్టు కీలక ప్రకటన […]
కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో అమెరికా, భారత్ ముందస్తు చర్యలు చేపట్టాయి. యూరప్ నుంచి వచ్చే ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఈ నిషేధం నేటి నుంచి 30 రోజుల పాటు అమలులో ఉంటుందని వైట్ హౌస్ ప్రకటించింది. యూరప్ లోని యూకే, ఇటలీలో వైరస్ విజృంభిస్తుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ట్రంప్ తెలిపారు.
ఇండియా కూడా గతంలో జారీ చేసిన టూరిస్ట్ వీసాలను రద్దు చేస్తున్నట్టు కీలక ప్రకటన జారీ చేసింది. మార్చి 13 నుంచి ఏప్రిల్ 19 వరకూ ఈ నిర్ణయం అమలులో ఉంటుందని కేంద్రం ప్రభుత్వం ప్రకటించింది.
tag; corona, america, indian, tourist visa ban