నేటితో ముగియనున్న పట్టణ ప్రగతి
దిశ, మేడ్చల్: నేటితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ముగియనుంది. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 4వ తేదీతో ముగుస్తుంది. జిల్లా వ్యాప్తంగా 10 రోజుల పాటు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రి, మున్సిపల్ అధికారులు పట్టణ ప్రగతిలో విస్తృతంగా పాల్గొన్నారు. మున్సిపాలిటీలు, వార్డుల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధానంగా పచ్చదనం, పరిశుభ్రతపై ప్రజలకు వివరించారు. వార్డు కమిటీలు ఏర్పాటు చేసి ప్రత్యేకాధికారులను నియమించారు. వార్డుల వారీగా సమగ్ర […]
దిశ, మేడ్చల్: నేటితో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం ముగియనుంది. ఫిబ్రవరి 24న ప్రారంభమైన ఈ కార్యక్రమం మార్చి 4వ తేదీతో ముగుస్తుంది. జిల్లా వ్యాప్తంగా 10 రోజుల పాటు జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రి, మున్సిపల్ అధికారులు పట్టణ ప్రగతిలో విస్తృతంగా పాల్గొన్నారు. మున్సిపాలిటీలు, వార్డుల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధానంగా పచ్చదనం, పరిశుభ్రతపై ప్రజలకు వివరించారు. వార్డు కమిటీలు ఏర్పాటు చేసి ప్రత్యేకాధికారులను నియమించారు. వార్డుల వారీగా సమగ్ర వివరాలు సేకరించడంతో పాటు స్థానికంగా కావాల్సిన ప్రజల అవసరాలనూ గుర్తించారు. ఆయా కాలనీల్లో పేరుకుపోయిన డ్రయినేజీ, శిథిలాలు, వ్యర్థాలను తొలగించడం, విద్యుత్ మరమ్మతులు చేశారు.
Tags: Urban progress program, ends today, medchal, hyderabad, clean, green