జికా వైరస్ కలకలం.. 89 పాజిటివ్ కేసులు.. వైద్యులు అలర్ట్

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో మరోసారి జికా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా మరో 10 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం జికా వైరస్ బాధితుల సంఖ్య 89కి చేరింది. ఈ నేపథ్యంలో జికా కట్టడికి యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు వాయుసేన సిబ్బందికి జికా సోకిన కారణంగా ఐఏఎఫ్ స్థావరం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు […]

Update: 2021-11-07 23:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో మరోసారి జికా వైరస్ కలకలం సృష్టిస్తున్నది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో ఈ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా మరో 10 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో మొత్తం జికా వైరస్ బాధితుల సంఖ్య 89కి చేరింది. ఈ నేపథ్యంలో జికా కట్టడికి యూపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరోవైపు వాయుసేన సిబ్బందికి జికా సోకిన కారణంగా ఐఏఎఫ్ స్థావరం పరిసరాల్లో హై అలర్ట్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు ఆరోగ్య, పురపాలక శాఖ అధికారులతో కలిసి కాన్పుర్​ జిల్లా యంత్రాంగం కృషిచేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి జికా లక్షణాలు ఉన్నవారిని గుర్తిస్తున్నారని చెప్పారు. మొత్తం 150 బృందాలతో శానిటైజేషన్‌, ఫాగింగ్‌ చేస్తున్నట్టు పేర్కొన్నారు. జికా వైరస్​ వ్యాప్తి నేపథ్యంలో స్థానికులెవరూ భయాందోళనకు గురి కావద్దని సూచించారు.

 

Tags:    

Similar News