యూపీ హాట్‌స్పాట్‌లు టోటల్ సీల్
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కరోనా హాట్‌స్పాట్‌లను ఈ నెల 15 వరకు టోటల్‌గా సీల్ చేయనున్నట్టు ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఆ హాట్‌స్పాట్‌లలో అత్యవసర సరుకులన్నీ హోమ్ డెలివరీ అయ్యేలా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 15 రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో ఆరుకు మించి కరోనా కేసులు వెలుగుచూశాయని, అవే జిల్లాల్లో కొన్ని చోట్ల ఒకటి లేదా […]
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని కరోనా హాట్‌స్పాట్‌లను ఈ నెల 15 వరకు టోటల్‌గా సీల్ చేయనున్నట్టు ఆ రాష్ట్ర సర్కారు ప్రకటించింది. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఆ హాట్‌స్పాట్‌లలో అత్యవసర సరుకులన్నీ హోమ్ డెలివరీ అయ్యేలా ప్రభుత్వం బాధ్యత తీసుకుంటాయని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 15 రాష్ట్రాల్లో కొన్ని ఏరియాల్లో ఆరుకు మించి కరోనా కేసులు వెలుగుచూశాయని, అవే జిల్లాల్లో కొన్ని చోట్ల ఒకటి లేదా రెండు కేసులు నమోదయ్యాయని సర్కారు తెలిపింది. ఈ జిల్లాల్లోని హాట్‌స్పాట్‌లలోనే టోటల్ సీల్‌ను అమలు చేయనున్నట్టు వివరించింది. ఈ హాట్‌స్పాట్‌ల జాబితాలో లక్నో, గౌతమ్ బుద్ధ నగర్, నోయిడా, గజియాబాద్, మీరట్, ఆగ్రా, షామ్లీ, సహరన్‌పుర్‌లున్నాయి. అయితే, హాట్‌స్పాట్‌ల జాబితాపై ఈ రోజు రాత్రి స్పష్టత రానున్నది.
మాస్కులు పెట్టుకునే బయటికి రావాలి..
ఉత్తరప్రదేశ్‌లో కరోనా కేసులు 326ను చేరాయి. ముగ్గురు మరణించగా.. 21 మంది కోలుకున్నారు. ఈ నేపథ్యంలోనే సర్కారు హాట్‌స్పాట్‌లపై గురిపెట్టింది. దీంతోపాటు కరోనాను కట్టడి చేసేందుకు ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించాలని సూచించింది. బయట అడుగుపెడితే మాస్కులతోనైనా లేదా ఇతర వస్త్రాలతోనైనా ముఖాన్ని కవర్ చేసుకోవాలని ఆదేశిస్తూ యూపీ సర్కారు త్వరలో ఉత్తర్వులు జారీ చేయనుంది.
Tags: UP, mask, hotspots, seal, order, 15 districts, lucknow