‘చావనికే వస్తున్నప్పుడు ఎలా బతుకుతారు?’

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్.. సీఏఏ ఆందోళనకారుల మరణాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌లో మరణించిన ఆందోళనకారుల గురించి రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ.. చావనికే వస్తున్నప్పుడు వారు ఎలా బతికి ఉంటారు? అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్‌లో జరిగిన పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనల్లో సుమారు 20 మంది చనిపోయారు. ఆ మరణాల గురించి మాట్లాడుతూ.. సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసుల బుల్లెట్లతో ఎవరూ చనిపోలేదని, ఆందోళనకారుల బుల్లెట్లతోనే చనిపోయారని అన్నారు. ప్రజలను షూట్ […]

Update: 2020-02-19 06:12 GMT

ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్.. సీఏఏ ఆందోళనకారుల మరణాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్‌లో మరణించిన ఆందోళనకారుల గురించి రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడుతూ.. చావనికే వస్తున్నప్పుడు వారు ఎలా బతికి ఉంటారు? అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్‌లో జరిగిన పౌరసత్వ సవరణ చట్ట వ్యతిరేక ఆందోళనల్లో సుమారు 20 మంది చనిపోయారు. ఆ మరణాల గురించి మాట్లాడుతూ.. సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. పోలీసుల బుల్లెట్లతో ఎవరూ చనిపోలేదని, ఆందోళనకారుల బుల్లెట్లతోనే చనిపోయారని అన్నారు. ప్రజలను షూట్ చేయాలన్న ఆలోచనతో వీధుల్లోకి వచ్చినప్పుడు.. అయితే తనే చస్తాడు లేదంటే పోలీసు మరణిస్తాడని తెలిపారు. డిసెంబర్‌లో చోటుచేసుకున్న హింస తర్వాత పోలీసుల పనితీరును మెచ్చుకోవాల్సిందేనని అన్నారు. అప్పటి నుంచి అల్లర్లు జరగలేవని తెలిపారు.

Tags:    

Similar News