చేతులెత్తేసిర్రు..

దిశ ప్రతినిధి, నల్లగొండ/ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయేతర ఆస్తు ల సర్వే కొత్త చిక్కుల్ని తీసుకొస్తుంది. దసరా నాటికి ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో వ్యవసాయేతర కేటగిరీలో ఉన్న ఇండ్లు, ఇతర నిర్మాణాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ గ్రామీణ ప్రాంతాల్లో ఘర్షణపూరిత వాతావరణానికి దారి తీస్తోంది. వారసత్వపు నిర్మాణాలు, ఏండ్ల కిందటి పురా తన ఇండ్లలో కాలం వెళ్లదీసుకుంటూ వస్తున్న కుటుంబాలు.. ఈ సర్వేలో నమోదు చేసుకోవాలంటే.. ఇంటి కాగితాలు కా వాలంటూ కొర్రీలు […]

Update: 2020-10-08 04:03 GMT

దిశ ప్రతినిధి, నల్లగొండ/ఖమ్మం: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయేతర ఆస్తు ల సర్వే కొత్త చిక్కుల్ని తీసుకొస్తుంది. దసరా నాటికి ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో వ్యవసాయేతర కేటగిరీలో ఉన్న ఇండ్లు, ఇతర నిర్మాణాలను డిజిటలైజేషన్ చేసే ప్రక్రియ గ్రామీణ ప్రాంతాల్లో ఘర్షణపూరిత వాతావరణానికి దారి తీస్తోంది. వారసత్వపు నిర్మాణాలు, ఏండ్ల కిందటి పురా తన ఇండ్లలో కాలం వెళ్లదీసుకుంటూ వస్తున్న కుటుంబాలు.. ఈ సర్వేలో నమోదు చేసుకోవాలంటే.. ఇంటి కాగితాలు కా వాలంటూ కొర్రీలు పెడుతుర్రు. అసలు కాగితాలు కాదు కదా.. ఆ ఇంటి విస్తీర్ణం ఎంత ఉంటదన్న సంగతే చాలామందికి తెలియదు. కానీ సర్వే చేయాలంటే.. ఇంటి కాగితం, కరెంటు బిల్లు, ఆధార్ కార్డు, జాబ్ కార్డు నంబరు తదితర వివరాలు ఇవ్వాలంటూ సర్వే సిబ్బంది అడుగుతుర్రు. వాళ్లు అడిగే వాటిల్లో సగానికి పైగా ఏ కాగితాలు లేకపోవడంతో సర్వే చేయ కుండా ఆపేస్తుర్రు. దీంతో తమ ఆస్తులను ప్రభుత్వం యాడ గుంజుకుంటుందోనని మస్తు గుబులుపడుతుర్రు.

పంచాయతీ కార్యాలయం కాడ్నే అన్నీ..

ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా చాలా గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శితో పాటు సర్వే సిబ్బంది పం చాయతీ కార్యాలయం కాడ్నే అన్నీ పూర్తి చేస్తున్నారు. వాస్తవానికి ఇంటింటికీ తిరిగి లైవ్‌గా ఇంటి కొలతలు తీసుకుని వెబ్‌సైట్‌లో నమోదు చేయాల్సి ఉంది. కానీ ఇంటింటికీ తిరగడం.. సర్వే సిబ్బంది ఇంటికి వెళ్లిన సమయంలో యజమాని లేకపోవడం.. ఏ కాగితాలు సరిగా చూపకపోవడం.. కొన్ని ఇండ్ల విషయంలో స ర్వే సిబ్బందితో అన్నదమ్ముల మధ్య ఘర్షణలు తలెత్తి.. పంచాయతీ కార్యదర్శి, సర్వే సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. ఈ తలనొప్పి అంతా ఎందుకని.. పంచాయతీ కార్యదర్శులు, సర్వే సిబ్బంది ఇంటింటికీ తిరగడం మానేశారు. అందరూ పంచాయతీ కార్యాలయం వద్దకే వచ్చి ఆస్తులు నమోదు చేసుకోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో జనాలు పనులు మానుకుని రోజుల తరబడి పంచాయతీ కార్యాలయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. సర్వే సిబ్బంది సైతం.. ఏ దో చేయాలంటే.. చేయాలి అన్నట్టుగా చేస్తున్నారే తప్ప సిబ్బం దిలో అంకితభావం ఉండట్లేదు.

కాగితాలు కావాలంటూ కొర్రీలు..

వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు సంబంధించి యాప్‌లో 40 అంశాలను నమోదు చేయాల్సి ఉంది. అయితే ఇందులో 27 అంశాలను తప్పనిసరిగా నమోదు చేయా లి. సర్వే ప్రక్రియకు సంబంధించి ఇంటి ముందు యాజమానిని నిలబెట్టి ఫొటోను క్యాప్చర్ చేయాలి. మొత్తం సర్వే ప్రక్రియలో ఇంటి నంబర్, ఇంటి ఓనర్ ఆధార్ కార్డు నంబర్, భార్యభర్తల వివరాలు, వారసుల పేర్లు, కుటుంబ సభ్యుల ఆధార్ నంబర్లు, ఫోన్ నంబరు, సర్వే నంబర్, ఆస్తి రకం, ఇంటి విస్తీర్ణం, రేషన్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు, జన్‌ధన్ అకౌంట్ వంటి వివరాలు యాప్‌‌లో నమోదు చేస్తుండగా, కరెంటు బిల్లు, ఇంటి కాగితం, ఆధార్ కార్డు నకళ్లు ఇవ్వాలని సిబ్బంది అడుగుతున్నారు. కానీ చాలామంది వద్ద ఇంటి కాగితాలు, ఇంటి యాజమాని పేరు మీద కరెంటు బిల్లు కాగితం ఇవ్వాలని సూచిస్తున్నారు. అవి ఉంటేనే.. వ్యవసాయేత ఆస్తులను నమోదు చేసుకుంటామని, లేకపోతే చేసుకోబోమని తెల్చి చెబుతున్నారు. దీంతో సంబంధిత పత్రాలు లేవని, మా ఆస్తులు ఎటు పోతాయంటూ ఆవేదన చెందుతున్నారు.

శిక్షణ లేని సిబ్బందితో సమస్యలు..

వ్యవసాయేతర ఆస్తులను నమోదు చేసుకోవడంలో ఇంటి విస్తీర్ణాన్ని కొలతలు వేయాల్సి ఉంది. అయితే ఇంటి కొలతలు వేయడం అనేది అంత సులవైన పనికాదు. నాలుగు మూలలు సమానంగా ఉండే స్థలాన్ని కొలతలు వేయడంలో ఏ ఇబ్బందులు తలెత్తవు. వంకరగా ఉండే ఇంటి నిర్మాణాలను కొలత వేయడం తలకు మించిన భారంగా మారుతోంది. అయితే సర్వే చేస్తున్న సిబ్బందికి అవగాహన లేకపోవడం వల్ల కొలతలు తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతున్నాయి. వాస్తవంగా ఉన్న విస్తీర్ణం కంటే ఎక్కువ, తక్కువ విస్తీర్ణం లెక్కలోకి వస్తోంది. దీంతో మీ ఇంటి కాగితాల్లో తేడా ఉంది.. సరి చేసుకోవాలని, సర్వేకు మరోసారి చేస్తామంటూ చెబుతున్నారు. ఇదే సమయంలో ఇంటి హద్దుల విషయంలో గానీ కొలత తీసుకోవడంలో గానీ వివాదాలు నెలకొంటుండడంతో ఇంటి కాగితాల్లో ఎంత విస్తీర్ణం ఉంటే.. యాప్‌లో అంతే నమోదు చేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో ఇంటి యాజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొలతలకు సంబంధించి ఇప్పటికే సర్వేయర్లుగా డిప్లొమా పూర్తి చేసిన వారు చాలామంది ఖాళీగానే ఉంటున్నారు. వారికి తగిన పారితోషికం ఇచ్చి వారి సేవలు వినియోగించుకుంటే.. మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. దీనికితోడు వ్యవసాయేతర ఆస్తులను సర్వే చేసేందుకు గ్రామ పంచాయతీ సిబ్బందినే పూర్తిగా వినియోగిస్తున్నారు. వాస్తవానికి పంచాయతీ కార్యదర్శి మినహా పంచాయతీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది.. దాదాపుగా పదో తరగతికి మించి చదివినవారు వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. సమస్యల ఉత్పన్నానికి ఇది కూడా ఒక కారణంగానే చెప్పొచ్చు.

దళారుల రంగ ప్రవేశం..

వ్యవసాయేతర ఆస్తుల నమోదు ప్రక్రియ ప్రస్తుతం గ్రామీణ ప్రాంత ప్రజలకు తలకు మించిన భారంగా మారుతోంది. వాస్తవానికి పంచాయతీ సిబ్బందికి యాప్‌లో నమోదు చేసే వివరాల విషయంలో క్లారిటీ లేకపోవడం.. అదే సమయంలో ప్రజల నుంచి వచ్చే సందేహాలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు. ఇంటి కాగితాలు, ఓనర్ పేరు మీద కరెంటు బిల్లు లేకపోవడం, ఇంటి యాజమాని పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం వంటి కారణాల వల్ల చాలా ఇండ్లు, ఆస్తులు యాప్‌లో నమోదు కాట్లేదు. దీనివల్ల జనాల్లో తమ ఆస్తులను ప్రభుత్వం ఎక్కడ లాక్కుంటుందోనని ఒకింత భయాందోళనలు నెలకొన్నాయి. దీన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది రాజకీయ నేతలు.. దళారుల అవతారం ఎత్తారు. ఒక్కో ఇంటిని యాప్‌లో నమోదు చేసేందుకు రూ.2వేల నుంచి రూ.5వేలు వసూలు చేస్తున్నారు. ఇంటి కాగితాలు లేని వారు.. బాండ్ పేపర్ మీద సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవడం వారికి ఆర్థికంగా కలిసిసోస్తుంది.

కార్యదర్శులకు ముప్పుతిప్పలు..

వ్యవసాయేర ఆస్తు ల నమోదు ప్రక్రియకు సంబంధించి పంచాయతీ కార్యదర్శులు ముప్పుతిప్పలు పడుతున్నారు. అసలు ఇప్పటికే పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికల నిర్మాణం, గతంలో చేపట్టిన పల్లె ప్రగతి, ఉపాధి హామీ బాధత్యలను మోస్తున్నారు. దీనికితోడు గ్రామాభివృద్ది పనులకు సంబంధించి పెండింగ్ బిల్లులు, రాజకీయ ఘర్షణలకు తోడు కొత్తగా వ్యవసాయేతర ఆస్తుల సర్వే తలకు మించిన భారంగా మారుతోంది. ఈ క్రమంలోనే నిరంతరాయంగా కొనసాగుతున్న విధుల వల్ల అలసిపోవడం, ప్రజల నుంచి ఒత్తిళ్లు ఎదుర్కొవడం వల్ల తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఫలితంగా తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుంది. పంచాయతీ కార్యదర్శులు ఉదయం 6 గంటలకు గ్రామానికి చేరుకుంటే.. తిరిగి వారి ఇళ్లకు చేరుకుంటే.. రాత్రి 9 అవుతోందని పంచాయతీ కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రిభువనగిరి జిల్లా రాజపేట మండలం పొదిళ్ల గ్రామానికి చెందిన జక్కుల నరేందర్ ఇదే మండలంలోని పారుపల్లి పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గత కొంతకాలంగా విరామం లేని విధుల వల్ల అలసిపోయాడు. ఇదే విషయాన్ని స్నేహితులు, తోటి ఉద్యోగులతోనూ మొర పెట్టుకున్నారు. ప్రభుత్వ తీరు వల్ల పంచాయతీ కార్యదర్శిగా పనిచేయడం కంటే.. కూలీనాలి పనిచేసుకోవడం నయమంటూ వాపోయాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఉదయం గుండెపోటుతో చనిపోయాడు. వాస్తవానికి పంచాయతీ కార్యదర్శులు గత కొంతకాలంగా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారనేది అక్షర సత్యం.

ఇంటి విస్తీర్ణంపై నిర్దిష్ఠంగా కొల‌త‌ల్లేవ్‌..

ఖ‌మ్మం ప‌ట్టణంలోఒక్కో డివిజ‌న్‌కు నాలుగు బృందా లు స‌ర్వే నిర్వహిస్తున్నాయి. ఒక్కో బృందంలో ఇద్దరేసి సిబ్బంది ఉంటారు. ఒక్కో బృందానికి దాదాపు 250 ఇళ్లను కేటాయింపు చేశారు. ఇప్పటి వ‌ర‌కు ఒక్కో బృం దం150 నుంచి 180 ఇళ్ల స‌ర్వే పూర్తి చేశాయి. అయితే కొన్ని డివిజ‌న్లలో స‌ర్వే 150లోపే ఉండ‌టం గ‌మ‌నార్హం. స‌రైన స‌మాచారం లేక‌పోవ‌డంతో జ‌నా లు ఇళ్ల వ‌ద్ద ఉండ‌టం లేద‌ని సిబ్బంది చెబుతున్నారు. ఉద్యోగులు కూడా మ‌ధ్యాహ్నం వేళ‌ల్లో ఉండ‌టం లేద‌ ని, స‌ర్వేలో జాప్యం జ‌రుగుతోంద‌ని పేర్కొంటున్నారు. 57 ర‌కాల అంశాల‌కు సంబంధించిన వివ‌రాల‌ను ఇం టి య‌జ‌మానుల నుంచి స‌ర్వే సిబ్బంది సేక‌రిస్తున్నారు. అందులో ప్రధాన‌మై న‌ది ఇంటి య‌జమాని పేరు, కు టుంబ స‌భ్యుల పేర్లు, వారి ఆధార్ నెంబ‌ర్లు, రేష‌న్ వి వ‌రాలు, న‌ల్లా క‌నెక్షన్‌, ఇంటి ప‌న్ను ర‌శీదు, ఇంటి స్థలానికి ప‌ట్టా ఉందా? లేదా? మొబైల్ నెంబ‌ర్ వంటి విష‌యాల‌ను సేక‌రిస్తున్నారు. అయితే ఇంటి విస్తీర్ణంకు సంబంధించి ఖ‌మ్మం కార్పొరేష‌న్ ప‌రిధిలోగా, మున్సిపాలిటీల్లోగాని కొల‌త‌లు వేయ‌వ‌ద్దని ఉన్నతాధికారులు ఆదేశించిన‌ట్లు సిబ్బంది తెలుపుతున్నారు.

Tags:    

Similar News