రూ. 4.84 కోట్లకు అమ్ముడుపోయిన సూపర్ మారియో గేమ్ కాపీ

దిశ, ఫీచర్స్: ప్రస్తుత టెక్ ఎరాలో రోజుకో కొత్త గేమ్ పుట్టుకొస్తోంది. ఈ క్రమంలో వార్ గేమ్స్, బాటిల్ గేమ్స్ అత్యంత ఆదరణ అందుకుంటుండగా.. 90’s జనరేషన్‌ ఫేవరెట్ గేమింగ్ లిస్ట్‌లో మాత్రం ఎప్పటికీ ‘సూపర్ మారియో’ గేమ్ టాప్ ప్రయారిటీ అందుకుంటోంది. జపనీస్ వీడియో గేమ్ డిజైనర్ షిగెరు మియామోటో ఈ మారియో క్యారెక్టర్‌ను సృష్టించగా, అప్పటి నుంచి 200కి పైగా వీడియో గేమ్స్‌లో కనిపించిన మారియో.. జపనీస్ ఫేమస్ వీడియో గేమ్ సంస్థ నింటెండోకు […]

Update: 2021-04-03 02:48 GMT

దిశ, ఫీచర్స్: ప్రస్తుత టెక్ ఎరాలో రోజుకో కొత్త గేమ్ పుట్టుకొస్తోంది. ఈ క్రమంలో వార్ గేమ్స్, బాటిల్ గేమ్స్ అత్యంత ఆదరణ అందుకుంటుండగా.. 90’s జనరేషన్‌ ఫేవరెట్ గేమింగ్ లిస్ట్‌లో మాత్రం ఎప్పటికీ ‘సూపర్ మారియో’ గేమ్ టాప్ ప్రయారిటీ అందుకుంటోంది. జపనీస్ వీడియో గేమ్ డిజైనర్ షిగెరు మియామోటో ఈ మారియో క్యారెక్టర్‌ను సృష్టించగా, అప్పటి నుంచి 200కి పైగా వీడియో గేమ్స్‌లో కనిపించిన మారియో.. జపనీస్ ఫేమస్ వీడియో గేమ్ సంస్థ నింటెండోకు మస్కట్ కూడా కావడం విశేషం. కాగా అన్‌ఓపెన్డ్ సూపర్ మారియో గేమ్ కాపీ ఒకటి తాజాగా రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయి, గేమింగ్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన గేమ్‌గా నిలిచింది.

90వ దశకంలో అందరూ ఇష్టపడి మారియో గేమింగ్ కాపీలు కొనుక్కున్నట్లే, 1986లో ఈ గేమ్‌ను కొనుగోలు చేసిన ఓ వ్యక్తి.. ఓపెన్ చేయకుండా టేబుల్ డ్రాయర్‌లో పెట్టి మర్చిపోయాడు. గేమ్ ప్యాకెట్ ప్లాస్టిక్‌లో హాంగ్ ట్యాబ్‌తో సీల్ చేసిన ఈ కాపీ గతేడాది బయటపడింది. ప్రస్తుతం ఇది డల్లాస్‌లోని హెరిటేజ్ ఆక్షన్ హౌస్ దగ్గర ఉండగా, తాజాగా ఈ కాపీని వేలం వేసింది. 310,000 డాలర్ల(రూ. 2.27కోట్లు) బేస్ బిడ్‌తో వేలం ప్రారంభం కాగా, రికార్డు స్థాయిలో 660,000 డాలర్లు(రూ. 4,84,29,500) దక్కించుకుంది. కాగా దీన్ని అత్యుత్తమమైన కాపీగా అభివర్ణించింది హెరిటేజ్.

సూపర్ మారియో కాపీలు రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదేం కొత్త కాదు. యూఎస్ వెర్షన్ ఆఫ్ ది గేమ్ సూపర్ మారియో జులై 2020లో 114,000 డాలర్లకు అమ్ముడుపోయింది. ఇది కూడా ఓ రికార్డ్ కాగా, మరో సూపర్ మారియో కాపీ గత నవంబర్‌లో పాత రికార్డులను బ్రేక్ చేస్తూ 1,56,000 డాలర్లు దక్కించుకుంది. మోస్ట్ ఎక్సెపెన్సివ్ వీడియో గేమ్‌గా ఇది చరిత్రకెక్కగా, తాజా వేలంతో గత రికార్డ్‌లన్నీ బ్రేక్ అవ్వడం విశేషం.

Tags:    

Similar News