కొలిక్కి వచ్చిన యూకే, ఈయూల వాణిజ్య ఒప్పందం
దిశ, వెబ్‌డెస్క్ : బ్రిటన్, యూరోపియన్ యూనియన్(ఈయూ)ల మధ్య నెలలపాటు సాగిన చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై గురువారం ఒక అంగీకారం కుదిరింది. ఈయూ నుంచి పూర్తిస్థాయిలో యూకే వైదొలగడానికి మరో వారం వ్యవధి ఉండగానే డీల్ కుదిరిందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. జీరో టారీఫ్, జీరో కోటాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరిందని వెల్లడించింది. యూకే, ఈయూ మధ్య ఒక అంగీకారం కుదిరిందని ఈయూ అధికారులూ ధ్రువీకరించారు. సమతూకమైన ఒప్పందం, ఇరువైపులా […]
దిశ, వెబ్‌డెస్క్ : బ్రిటన్, యూరోపియన్ యూనియన్(ఈయూ)ల మధ్య నెలలపాటు సాగిన చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై గురువారం ఒక అంగీకారం కుదిరింది. ఈయూ నుంచి పూర్తిస్థాయిలో యూకే వైదొలగడానికి మరో వారం వ్యవధి ఉండగానే డీల్ కుదిరిందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. జీరో టారీఫ్, జీరో కోటాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరిందని వెల్లడించింది. యూకే, ఈయూ మధ్య ఒక అంగీకారం కుదిరిందని ఈయూ అధికారులూ ధ్రువీకరించారు.
సమతూకమైన ఒప్పందం, ఇరువైపులా బాధ్యతలతో కూడిన ఒప్పందం కుదిరిందని యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సుల వన్ డిర్ లెయెన్ తెలిపారు. పన్నులు, కోటాలు లేకుండా ఉభయులూ వాణిజ్యం చేయడానికి వీలయ్యేలా డీల్ కుదిరిందని వివరించారు. బ్రిటీష్, యూరోపియన్ పార్లమెంటులు ఈ ఒప్పందంపై ఓటింగ్ నిర్వహించాల్సి ఉన్నది. యూకే వైదొలిగిన తర్వాతే యూరోపియన్ పార్లమెంటులో ఓటింగ్ జరగనుంది.