పోర్టుల ప్రైవేటీకరణపై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి

దిశ, ఏపీ బ్యూరో : దేశంలో ప్రైవేటీకరణ అంశం హడలెత్తిస్తోంది. విమానాశ్రయాలు, స్టీల్ ప్లాంట్లు ఇలా నష్టాల్లో ఉన్న అనేక సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా దేశంలోని మేజర్ పోర్టులను సైతం కేంద్రం ప్రైవేటీకరణ చేస్తోందని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలోని పోర్టులపై కేంద్రం పెత్తనమేంటంటూ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ సహాయమంత్రి శాంతాను ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని […]

Update: 2021-09-25 05:44 GMT

దిశ, ఏపీ బ్యూరో : దేశంలో ప్రైవేటీకరణ అంశం హడలెత్తిస్తోంది. విమానాశ్రయాలు, స్టీల్ ప్లాంట్లు ఇలా నష్టాల్లో ఉన్న అనేక సంస్థలను కేంద్రం ప్రైవేటీకరణ చేస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా దేశంలోని మేజర్ పోర్టులను సైతం కేంద్రం ప్రైవేటీకరణ చేస్తోందని ప్రచారం జరుగుతుంది. రాష్ట్రంలోని పోర్టులపై కేంద్రం పెత్తనమేంటంటూ కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మండిపడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ సహాయమంత్రి శాంతాను ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలోని మేజర్‌ పోర్టులను ప్రైవేటీకరించాలన్న ఆలోచన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా విశాఖపట్నం చేరుకున్న ఆయన శనివారం విశాఖ పోర్టులో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

క్రూయిజ్‌ టెర్మినల్, పలు బెర్తుల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే స్వచ్ఛభారత్ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అనంతరం కేంద్రమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఇండియన్‌ పోర్టుల ముసాయిదా బిల్లును ఏపీతో పాటు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ పరిణామాలతో ఆయా రాష్ట్రాలతో మరోసారి చర్చించి ఇండియన్ పోర్టుల ముసాయిదా బిల్లుపై ముందుకెళ్తామని తెలిపారు. అయితే ప్రైవేటు పోర్టుల నుంచి వస్తున్న పోటీ నేపథ్యంలో విశాఖ పోర్టు అమలుచేస్తున్న బెర్తు లీజులను క్రమబద్ధీకరించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

పెట్టుబడులను ఆకర్షిస్తున్న విశాఖపోర్టు

విశాఖపట్నం పోర్టు పెట్టుబడులను ఆకర్షిస్తోందని కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ సహాయమంత్రి శాంతాను ఠాకూర్ స్పష్టం చేశారు. గత దశాబ్ద కాలంలో పీపీపీ విధానంలో పోర్టు రూ.2 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిందని వెల్లడించారు. ఇక మారిటైం ఇండియా సమ్మిట్‌లో పోర్టు ఏకంగా రూ.26 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు చెప్పుకొచ్చారు. ఈ పెట్టుబడులను పరిశీలిస్తే భవిష్యత్‌లో విశాఖ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు రాబోయే 8 నెలల్లో విశాఖ–రాయపూర్‌ సాగరమాల ప్రాజెక్టు పనులను కూడా ప్రారంభించబోతున్నట్లు కేంద్రమంత్రి వెల్లడించారు.

Tags:    

Similar News