బార్డర్‌లో మన భూభాగం పదిలం: రాజ్‌నాథ్

న్యూఢిల్లీ: భారత సరిహద్దులోకి చైనా సైన్యం చొచ్చుకొచ్చిందన్న కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తిప్పికొట్టారు. సరిహద్దులో పరిస్థితులు అదుపులో ఉన్నాయని అన్నారు. భారత భూభాగంలోకి చైనా సైన్యం ప్రవేశించలేదని స్పష్టం చేశారు. భారత భూభాగాన్ని చైనా సైన్యం ఆక్రమించిందన్న వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. చైనాతో కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నాయని, అయితే ఎన్నడు సమస్య పరిష్కారమవుతుందని ఇప్పుడే చెప్పలేమని వివరించారు. కానీ, చైనా సైన్యం భారత భూభాగంలోకి రాలేదని అన్నారు. ఎవ్వరూ భారత […]

Update: 2020-11-02 09:30 GMT

న్యూఢిల్లీ: భారత సరిహద్దులోకి చైనా సైన్యం చొచ్చుకొచ్చిందన్న కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తిప్పికొట్టారు. సరిహద్దులో పరిస్థితులు అదుపులో ఉన్నాయని అన్నారు. భారత భూభాగంలోకి చైనా సైన్యం ప్రవేశించలేదని స్పష్టం చేశారు. భారత భూభాగాన్ని చైనా సైన్యం ఆక్రమించిందన్న వ్యాఖ్యలు అర్థరహితమని అన్నారు. చైనాతో కమాండర్ స్థాయి చర్చలు జరుగుతున్నాయని, అయితే ఎన్నడు సమస్య పరిష్కారమవుతుందని ఇప్పుడే చెప్పలేమని వివరించారు. కానీ, చైనా సైన్యం భారత భూభాగంలోకి రాలేదని అన్నారు. ఎవ్వరూ భారత భూభాగంపై కన్నేసే సాహసం చేయబోరని తెలిపారు. గాల్వన్ ఘర్షణల తర్వాత తాను, ప్రధాని సరిహద్దులో జవాన్లను కలిశారని గుర్తుచేశారు.

Tags:    

Similar News