రూ.250కి ఒక్కరూపాయి ఎక్కువ ఇవ్వొద్దు : కిషన్ రెడ్డి

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మంగళవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో కిషన్‌రెడ్డికి వైద్యులు వ్యాక్సిన్‌ను ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సెంటర్‌లో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితం అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.250కి ఒక్కరూపాయి కూడా ఎక్కువ ఇవ్వొద్దని వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా కేవలం రూ.250 మాత్రమే వసూలు చేయాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో 91 వ్యాక్సిన్ కేంద్రాలల్లో 45 ప్రభుత్వానివని తెలిపారు. ఈ […]

Update: 2021-03-01 23:55 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. మంగళవారం ఉదయం గాంధీ ఆస్పత్రిలో కిషన్‌రెడ్డికి వైద్యులు వ్యాక్సిన్‌ను ఇచ్చారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ సెంటర్‌లో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితం అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో రూ.250కి ఒక్కరూపాయి కూడా ఎక్కువ ఇవ్వొద్దని వెల్లడించారు. ప్రైవేట్ ఆస్పత్రులు కూడా కేవలం రూ.250 మాత్రమే వసూలు చేయాలని సూచించారు. ప్రస్తుతం తెలంగాణలో 91 వ్యాక్సిన్ కేంద్రాలల్లో 45 ప్రభుత్వానివని తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర హాజరయ్యారు.

Tags:    

Similar News