బాలాజీ రిజర్వాయర్​ నిర్మాణానికి సహకరిస్తాం

దిశ, ఏపీ బ్యూరో: తిరుమ‌ల శ్రీ‌వారి దర్శనార్థం వ‌స్తున్న భ‌క్తుల నీటి అవ‌స‌రాల కోసం బాలాజీ రిజర్వాయ‌ర్ నిర్మించేందుకు కేంద్రం త‌ర‌ఫున స‌హ‌కారం అందిస్తామ‌ని జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ తెలిపారు. శనివారం తిరుమ‌ల‌లోని పాప‌వినాశ‌నం డ్యామ్‌ను ఆయన పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ మీడియాతో మాట్లాడుతూ బాలాజీ రిజర్వాయ‌ర్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నివేదిక పంపితే ప‌రిశీలిస్తామన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా చేప‌ట్టిన ప్రతి ఇంటికీ తాగునీరు అందించే ప్రాజెక్టు కింద నిధులిస్తామని […]

Update: 2020-10-03 08:33 GMT

దిశ, ఏపీ బ్యూరో: తిరుమ‌ల శ్రీ‌వారి దర్శనార్థం వ‌స్తున్న భ‌క్తుల నీటి అవ‌స‌రాల కోసం బాలాజీ రిజర్వాయ‌ర్ నిర్మించేందుకు కేంద్రం త‌ర‌ఫున స‌హ‌కారం అందిస్తామ‌ని జ‌ల‌శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ తెలిపారు. శనివారం తిరుమ‌ల‌లోని పాప‌వినాశ‌నం డ్యామ్‌ను ఆయన పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ మీడియాతో మాట్లాడుతూ బాలాజీ రిజర్వాయ‌ర్ నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం నివేదిక పంపితే ప‌రిశీలిస్తామన్నారు. కేంద్రం దేశవ్యాప్తంగా చేప‌ట్టిన ప్రతి ఇంటికీ తాగునీరు అందించే ప్రాజెక్టు కింద నిధులిస్తామని తెలిపారు. తొలుత మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆల‌యం వద్దకు చేరుకున్న కేంద్రమంత్రికి టీటీడీ చైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి, అద‌న‌పు ఈవో ఏవీ ధ‌ర్మారెడ్డి స్వాగ‌తం ప‌లికారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. మంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అంద‌జేశారు.

Tags:    

Similar News