ఎండకు తట్టుకోలేక.. నీరు, ఆహారం దొరక్క మహిళ మృతి
దిశ, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పట్నాపూర్ సరిహద్దు ప్రాంతంలో దాదాపు 60 ఏండ్ల వయస్సున్న గుర్తుతెలియని మహిళ మృతదేహం పడి ఉంది. స్థానిక ఎస్ఐ రాజు వివరాల ప్రకారం.. పట్నపూర్ నుండి పెండల్‌దరి మార్గంమధ్యంలో పశువుల కాపరి సోమవారం పశువుల మేతకు వెళ్లినప్పుడు మృతదేహం చూసి గ్రామ సర్పంచ్‌కు సమాచారం అందించారు. దీంతో వెంటనే సర్పంచ్ స్థానిక ఎస్‌ఐ రాజుకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ […]
దిశ, బోథ్: ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం పట్నాపూర్ సరిహద్దు ప్రాంతంలో దాదాపు 60 ఏండ్ల వయస్సున్న గుర్తుతెలియని మహిళ మృతదేహం పడి ఉంది. స్థానిక ఎస్ఐ రాజు వివరాల ప్రకారం.. పట్నపూర్ నుండి పెండల్‌దరి మార్గంమధ్యంలో పశువుల కాపరి సోమవారం పశువుల మేతకు వెళ్లినప్పుడు మృతదేహం చూసి గ్రామ సర్పంచ్‌కు సమాచారం అందించారు. దీంతో వెంటనే సర్పంచ్ స్థానిక ఎస్‌ఐ రాజుకు సమాచారం అందించారు. విషయం తెలిసిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ రాజు మృతదేహాన్ని పరిశీలించి, మాట్లాడుతూ.. ఆమె మృతిచెంది దాదాపు నాలుగు రోజులు అయిండొచ్చని స్పష్టం చేశారు. ఎండకు తట్టుకోలేక, తాగునీరు, ఆహారం లేక వడదెబ్బతో మృతిచెంది ఉండొచ్చని నిర్ధారించారు. మృతురాలి ఒంటిపై ఎరుపురంగు చీర, తెల్లటి జాకెట్, ఎర్రటి సంచి ఉందని వెల్లడించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.