రెండు ఏటీఎమ్‌లు పగలగొట్టి.. చోరీకి యత్నం

దిశ, దుబ్బాక: గుర్తుతెలియని దుండగులు ఏటీఎమ్‌లు ధ్వంసం చేసి, చోరీకి యత్నించారు. ఈ ఘటన దుబ్బాక నియోజకవర్గంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ యూనియన్ బ్యాంక్ ఏటీఎమ్, మిరుదొడ్డి మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఏటీఎమ్‌లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎమ్ మిషన్‌లు పగులగొట్టి డబ్బులు లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారని ఏసీపీ రామేశ్వర్ వెల్లడించారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనలకు […]

Update: 2020-08-16 04:30 GMT

దిశ, దుబ్బాక: గుర్తుతెలియని దుండగులు ఏటీఎమ్‌లు ధ్వంసం చేసి, చోరీకి యత్నించారు. ఈ ఘటన దుబ్బాక నియోజకవర్గంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ యూనియన్ బ్యాంక్ ఏటీఎమ్, మిరుదొడ్డి మండల కేంద్రంలో యూనియన్ బ్యాంక్ ఏటీఎమ్‌లలో గుర్తు తెలియని దుండగులు చోరీకి యత్నించారు. ఏటీఎమ్ మిషన్‌లు పగులగొట్టి డబ్బులు లేకపోవడంతో తిరిగి వెళ్లిపోయారని ఏసీపీ రామేశ్వర్ వెల్లడించారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘటనలకు పాల్పడి ఉంటారని తెలిపారు.

ఒకే సమయంలో రెండు ఏటీఎమ్‌లలో చోరీకి యత్నించారు. రెండింటిలో డబ్బులు లేకపోవడంతో వెళ్లిపోయినట్టు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మిరుదొడ్డిలో జరిగిన సంఘటన కూడా ఇదే విధంగా వివరించారు. ఏటీఎమ్ సీసీ కెమెరాల కనెక్షన్లు తొలగించే క్రమంలో సైరన్ రావడంతో వెంబడే పోలీసులు అక్కడికి చేరుకునే లోపు దుండగులు పరారయ్యారని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దుండగులను పట్టుకుని చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని, ఇలాంటి సంఘటనలకు ఎవరు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:    

Similar News