గుర్తు తెలియని మృతదేహం లభ్యం..
దిశ, గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ములుగు మండలం లోని వంటిమామిడి అడవి ప్రాంతంలో బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. ములుగు ఎస్సై రంగ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… రోడ్డు ప్రక్కనే ఉన్న మొక్కజొన్న కంకులు అమ్ముకునే వారు అడవి ప్రాంతంకు వెళ్లగా శవం ను కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. వంటిమామిడి అడవి ప్రాంతంలో ఆ మృతదేహం లభ్యమైందని […]
దిశ, గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ములుగు మండలం లోని వంటిమామిడి అడవి ప్రాంతంలో బుధవారం ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. ములుగు ఎస్సై రంగ కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… రోడ్డు ప్రక్కనే ఉన్న మొక్కజొన్న కంకులు అమ్ముకునే వారు అడవి ప్రాంతంకు వెళ్లగా శవం ను కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. వంటిమామిడి అడవి ప్రాంతంలో ఆ మృతదేహం లభ్యమైందని మృతుని వయసు (60-65)సంవత్సరం లు ఉంటాయని తెలిపారు. మృతిచెందిన వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే వెంటనే 100కు ఫోన్ చేసి చెప్పాలని అదేవిధంగా ములుగు పోలీసు స్టేషన్ ఫోన్ నంబర్ 9490617069 కు కాల్ చేసి తెలుపాలన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతుడి వివరాలపై ఆరా తీస్తున్నారు.