నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే

దిశ సిద్దిపేట: రాష్ట్రంలో జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని రెవల్యూషనరి సోషలిస్టు పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ మన్నె కుమార్,AIPSU సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఒగ్గు రమేష్ లు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగితే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనవే అన్న అంశాలపై కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకరి కుటుంబంకి మాత్రమే పరిమితమయ్యాయని వారు […]

Update: 2021-04-08 03:48 GMT

దిశ సిద్దిపేట: రాష్ట్రంలో జరుగుతున్న నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని రెవల్యూషనరి సోషలిస్టు పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లా కన్వీనర్ మన్నె కుమార్,AIPSU సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఒగ్గు రమేష్ లు డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగితే మన నీళ్లు, నిధులు, నియామకాలు మనవే అన్న అంశాలపై కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం ఒకరి కుటుంబంకి మాత్రమే పరిమితమయ్యాయని వారు అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన విద్యార్థుల ఆత్మ బలిదానాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా కొనసాగుతూనే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తంచేశారు. దీనంతటికి రాష్ట్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాలే కారణమని వారు స్పష్టంచేశారు.

ప్రభుత్వ ఉద్యోగుల వయోపరిమితి పెంపు కోసం ఎవరు అడగలేదు, ఉద్యమాలు చేయలేదని, కానీ కేవలం ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయాన్ని తీసుకుందని అన్నారు. దీని మూలంగా ఉన్నత చదువులు పూర్తి చేసుకుని అర్హతకు తగిన మంచి ఉద్యోగాన్ని సంపాదించి, వారి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని ఎన్నో ఆశలతో ఉన్న నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యారని తెలిపారు. కావున ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఈ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా తమ వైఖరిని ప్రకటించాలని వారు సూచించారు. లేని పక్షంలో RSP పార్టీ మరియు పార్టీ ప్రజాసంఘాలైన AIPSU, RYF మరియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనలు చేపడుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో AIPSU జిల్లా ఉపాధ్యక్షుడు ధర్మాజీ నీరజ్, రమేష్, వర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News