బెంగాల్‌లో రణరంగంగా బీజేపీ ర్యాలీ..

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ర్యాలీ రణరంగంగా మారింది. సోమవారం నిరసన ర్యాలీ జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ కార్యకర్తలపై టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ చర్యతో ఆగ్రహించిన బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య కార్యకర్తలతో కలిసి నడి రోడ్డుపై బైఠాయించి మమతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ […]

Update: 2020-12-07 07:37 GMT

దిశ, వెబ్‌డెస్క్ : పశ్చిమబెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ర్యాలీ రణరంగంగా మారింది. సోమవారం నిరసన ర్యాలీ జరుగుతున్న సమయంలో కొందరు వ్యక్తులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బీజేపీ కార్యకర్తలపై టియర్ గ్యాస్‌ ప్రయోగించారు. ఈ చర్యతో ఆగ్రహించిన బెంగళూరు ఎంపీ తేజస్వి సూర్య కార్యకర్తలతో కలిసి నడి రోడ్డుపై బైఠాయించి మమతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.

ఈ సందర్భంగా తేజస్వి మాట్లాడుతూ.. శాంతియుతంగా తాము నిరసన ర్యాలీ చేపట్టామన్నారు. కొందరు టీఎంసీ కార్యకర్తలు మా గుంపులో చేరి ఉద్రిక్తతకు తెరలేపారని చెప్పుకొచ్చారు. ఇక బెంగాల్ పోలీసులు వారిపై వాళ్లే రాళ్లు రువ్వుకున్నారని ఆయన ఆరోపించారు.

Tags:    

Similar News