అల్లుడిని హత్య చేసి తప్పించుకు తిరుగుతున్న మామ అరెస్ట్..
దిశ, చార్మినార్ : ఫలక్‌నుమాలో సంచలనం సృష్టించిన అల్లుడి హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న మామను ఫలక్‌నుమా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సౌత్ జోన్ డీసీపీ గజారావ్ భూపాల్ తెలిపారు. మంగళవారం సౌత్ జోన్ డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఫలక్‌నుమా ఏసీపీ మాజీద్, ఫలక్‌నుమా ఇన్ స్పెక్టర్ దేవేందర్ లతో కలిసి డీసీపీ వివరాలను వెల్లడించారు. వట్టేపల్లి ఫలక్‌నుమా కు చెందిన సయ్యద్ అన్వర్(39)కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు […]
దిశ, చార్మినార్ : ఫలక్‌నుమాలో సంచలనం సృష్టించిన అల్లుడి హత్య కేసులో తప్పించుకు తిరుగుతున్న మామను ఫలక్‌నుమా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు సౌత్ జోన్ డీసీపీ గజారావ్ భూపాల్ తెలిపారు. మంగళవారం సౌత్ జోన్ డీసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఫలక్‌నుమా ఏసీపీ మాజీద్, ఫలక్‌నుమా ఇన్ స్పెక్టర్ దేవేందర్ లతో కలిసి డీసీపీ వివరాలను వెల్లడించారు. వట్టేపల్లి ఫలక్‌నుమా కు చెందిన సయ్యద్ అన్వర్(39)కు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు సంతానం. వీరి పెద్ద కుమార్తె (17) ను ఫలక్‌నుమా ముస్తఫానగర్ కు చెందిన అబ్దుల్ షారూఖ్ (24) వృత్తి రీత్యా ఆటోడ్రైవర్ ప్రేమ పేరుతో వేధించసాగాడు.
మైనర్ బాలికను తీసుకొని అబ్దుల్ షారుఖ్ మే 2020 లో పరారయ్యాడు. అప్పట్లో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్‌నుమా పోలీసులు అబ్దుల్ షారుఖ్ పై పోక్సో (POCSO) చట్టం కింద కేసులు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. బెయిల్ పై వచ్చిన అబ్దుల్ షారుఖ్ గత నెల ఏప్రిల్ 2న అన్వర్ పెద్ద కుమార్తె ను రహస్యంగా నిఖా చేసుకున్నాడు. నీ కూతురును పంపించాలంటూ తరచూ మామ అన్వర్ కు షారుఖ్ ఫోన్ చేసి ఒత్తిడి చేయసాగాడు. షారుఖ్ కి అప్పటికే పెళ్లి అయి ముగ్గురు పిల్లలు ఉన్నారన్న విషయం తెలియడంతో ఎలాగైనా ఫారూఖ్ ను అంతమొందించాలనుకున్నాడు అన్వర్.
దీంతో ముందుగా వేసుకున్న పథకం ప్రకారం తన కూతురును నీ వెంట పంపిస్తాను.. వచ్చి తీసుకుపో అని మామ చెప్పడంతో అబ్దుల్ షారుఖ్ ఎగిరి గంతేశాడు. హోండా యాక్టీవా పై మామ ఇంటికి చేరుకున్నాడు షారుఖ్. శాలిబండాలో పని ఉంది.. అక్కడి దాకా వెళ్ళొద్దామని అల్లుడితో బైక్ పై బయలు దేరాడు అన్వర్. మార్గమధ్యలో జహనుమ ప్రాంతానికి చేరుకోగానే వెంట తెచ్చుకున్న కత్తితో అల్లుడి గొంతుకోసి హత మార్చాడు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న అన్వర్ ను ఫలక్ నుమా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు.