ఉద్యోగాల పేరిట ఘరానా మోసం..

ఉద్యోగాల పేరిట ఓ మాజీ మంత్రి పీఏ మోసానికి

Update: 2024-11-28 08:01 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఉద్యోగాల పేరిట ఓ మాజీ మంత్రి పీఏ మోసానికి పాల్పడిన విషయం బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... చెంగిచర్ల మేడిపల్లి ఆర్టీసీ కాలనీ కి చెందిన నాతి మహేష్ 2019లో హోంగార్డు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో సిద్దిపేట కు చెందిన బూరుగుపల్లి రామచందర్ రావు పరిచయం అయినట్లు తెలిపారు. రూ.5లక్షలు ఇస్తే నెల రోజుల్లో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలకగా రూ.4 లక్షలు ముట్ట చెప్పినట్లు తెలిపారు. ఉద్యోగం రాక పోవడం మోస పోయినట్లు గ్రహించి నిలదీయగా చెక్ ఇవ్వగా అందులో డబ్బులు లేవని తెలిసింది అన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదు లో మహేష్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా రామచందర్ రావును గతంలోనే ఉద్యోగం నుంచి తొలగించినట్లు సదరు మాజీ మంత్రి కార్యాలయం సిబ్బంది వెల్లడించారు.


Similar News