సన్‌రైజర్స్ జట్టులో మార్పు.. కొత్తగా వచ్చేది ఎవరు ?
దిశ, స్పోర్ట్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస వైఫల్యాలతో పూర్తి నిరాశలో ఉన్నది. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లకు గాను 7 మ్యాచ్‌లు ఓడిపోయి ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు వదిలేసుకున్నది. తాజాగా ఆల్‌రౌండర్ రూథర్‌ఫర్డ్ జట్టుకు దూరమయ్యాడు. అతడి తండ్రి చనిపోవడంతో స్వదేశం జమైకా వెళ్లిపోయాడు. జానీ బెయిర్‌స్టో స్థానంలో రూథర్‌ఫర్డ్‌ను రెండో దశలో తీసుకున్నది. అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే అతడు స్వదేశానికి వెళ్లిపోయాడు. ఇప్పటికే టి.నటరాజన్ కోవిడ్ కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. […]
దిశ, స్పోర్ట్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు వరుస వైఫల్యాలతో పూర్తి నిరాశలో ఉన్నది. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లకు గాను 7 మ్యాచ్‌లు ఓడిపోయి ప్లేఆఫ్ అవకాశాలు దాదాపు వదిలేసుకున్నది. తాజాగా ఆల్‌రౌండర్ రూథర్‌ఫర్డ్ జట్టుకు దూరమయ్యాడు. అతడి తండ్రి చనిపోవడంతో స్వదేశం జమైకా వెళ్లిపోయాడు. జానీ బెయిర్‌స్టో స్థానంలో రూథర్‌ఫర్డ్‌ను రెండో దశలో తీసుకున్నది. అయితే ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే అతడు స్వదేశానికి వెళ్లిపోయాడు.
ఇప్పటికే టి.నటరాజన్ కోవిడ్ కారణంగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అతడికి క్లోజ్ కాంటాక్ట్‌లోకి వెళ్లిన ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ ఐసోలేషన్‌లో ఉన్నాడు. దీంతో జమ్ము కశ్మీర్‌కి చెందిన ఉమ్రాన్ మాలిక్‌ను టి నటరాజన్ స్థానంలో తాత్కాలికంగా రిప్లేస్ చేస్తున్నట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ప్రకటించింది. ఐపీఎల్ నిబంధన 6.1 (సి) కింద జట్టుకు వెసులు బాటు ఉండటంతో ఉమ్రాన్‌ను జట్టులోకి తీసుకున్నది. ప్రస్తుతం సన్‌రైజర్స్ నెట్ బౌలర్‌గా పని చేస్తున్నాడు.