అడుగడుగునా హక్కుల ఉల్లంఘన : దేవినేని ఉమ

దిశ, ఏపీ బ్యూరో : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌ విషయంలో అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ట్వీట్ చేస్తూ, 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు అరెస్టులో అడుగడుగునా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని 600 కిలో మీటర్లు వాహనంలో తరలిస్తారా అని ప్రశ్నించారు. దారిపొడవునా రక్తస్రావం అవుతున్నా రాజకీయ కక్షసాధింపులో […]

Update: 2020-07-08 23:07 GMT

దిశ, ఏపీ బ్యూరో : టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్ట్‌ విషయంలో అడుగడుగునా మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని టీడీపీ నేత దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ట్వీట్ చేస్తూ, 5సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన అచ్చెన్నాయుడు అరెస్టులో అడుగడుగునా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని విమర్శించారు. శస్త్రచికిత్స చేయించుకున్న వ్యక్తిని 600 కిలో మీటర్లు వాహనంలో తరలిస్తారా అని ప్రశ్నించారు. దారిపొడవునా రక్తస్రావం అవుతున్నా రాజకీయ కక్షసాధింపులో భాగంగానే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేస్తారా? ఇందుకేనా ఒక్కఛాన్స్ అడిగింది సీఎం జగన్ గారూ’’ అంటూ దేవినేని ఉమ మండిపడ్డారు.

Tags:    

Similar News