పీఎం బోరిస్ జాన్సన్‌కు యూకే ఎంపీలు, లార్డ్స్‌ల లేఖ

న్యూఢిల్లీ: భారత్‌లో జరుగుతున్న రైతన్నల నిరసనలపై యూకే ఎంపీలు, లార్డ్స్(ఎగువ సభ సభ్యులు) ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు 100 మంది ఎంపీలు, లార్డ్స్‌ లేఖ రాశారు. ‘భారత పర్యటనను మీరు రద్దు చేసుకున్నారని తెలుసు. కానీ, త్వరలోనే మీరు భారత ప్రధానితో కలుస్తారని భావిస్తున్నాం. భారత్‌లో రైతు నిరసనలపై మేము ఆందోళన చెందుతున్నామని అప్పుడైనా భారత ప్రధానికి తెలియజేయండి. వారి డిమాండ్ల పరిష్కారానికి తాత్సారం వహించడం, ధర్నా చేస్తున్న రైతులపైకి […]

Update: 2021-01-09 10:33 GMT

న్యూఢిల్లీ: భారత్‌లో జరుగుతున్న రైతన్నల నిరసనలపై యూకే ఎంపీలు, లార్డ్స్(ఎగువ సభ సభ్యులు) ఆందోళన వ్యక్తం చేశారు. ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు 100 మంది ఎంపీలు, లార్డ్స్‌ లేఖ రాశారు. ‘భారత పర్యటనను మీరు రద్దు చేసుకున్నారని తెలుసు. కానీ, త్వరలోనే మీరు భారత ప్రధానితో కలుస్తారని భావిస్తున్నాం. భారత్‌లో రైతు నిరసనలపై మేము ఆందోళన చెందుతున్నామని అప్పుడైనా భారత ప్రధానికి తెలియజేయండి. వారి డిమాండ్ల పరిష్కారానికి తాత్సారం వహించడం, ధర్నా చేస్తున్న రైతులపైకి బలగాలను పంపించడంపై బాధపడుతున్నామని చెప్పండి. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించాలని కోరుతున్నట్టు తెలియజేయండి’ అని లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News