లవ్ ప్రపోజల్… ఆమె రిప్లైకు రెండేళ్ల జైలు శిక్ష

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ.. ఈ రోజుల్లో కామన్ వర్డ్. ఊహ తెలిసిన వయస్సు నుంచి రిటైర్డ్ ఏజ్ గ్రూప్ వారు సైతం ఈ పదాన్ని ఏదో ఒక సందర్భంలో తమకు నచ్చిన వారికి చెప్పి ఉండవచ్చు. ఒకవేళ ఎవరికీ చెప్పకపోయినా దానికి అర్థం తెలియకుండా అయితే ఎవరూ ఉండరు. ముఖ్యంగా లవ్ అనే పదాన్ని యువత ఎక్కువగా వాడుతుంటారు. సాధారణంగా కాలేజ్ డేస్‌లో పుట్టే ప్రేమ.. అదెంటో మరి ప్రజెంట్ జెనరేషన్‌లో స్కూల్ దశలోనే పుట్టెస్తోంది. […]

Update: 2021-02-05 09:06 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రేమ.. ఈ రోజుల్లో కామన్ వర్డ్. ఊహ తెలిసిన వయస్సు నుంచి రిటైర్డ్ ఏజ్ గ్రూప్ వారు సైతం ఈ పదాన్ని ఏదో ఒక సందర్భంలో తమకు నచ్చిన వారికి చెప్పి ఉండవచ్చు. ఒకవేళ ఎవరికీ చెప్పకపోయినా దానికి అర్థం తెలియకుండా అయితే ఎవరూ ఉండరు. ముఖ్యంగా లవ్ అనే పదాన్ని యువత ఎక్కువగా వాడుతుంటారు. సాధారణంగా కాలేజ్ డేస్‌లో పుట్టే ప్రేమ.. అదెంటో మరి ప్రజెంట్ జెనరేషన్‌లో స్కూల్ దశలోనే పుట్టెస్తోంది. టెక్నాలజీ మహిమో, సినిమాల ప్రభావం ఏమో గానీ, నేటితరం వారు లవ్ మత్తులో మునిగితేలుతున్నారు.

నచ్చిన అమ్మాయి కనిపిస్తే చాలు సెకను కూడా వెయిట్ చేయకుండా అబ్బాయిలు లవ్ ప్రపోజల్ పెట్టేస్తారు. తన లవ్ అంగీకరించే వరకు వారి వెంట తిరిగి ఎలాగోలా ఒకే చేయించుకుంటారు. అమ్మాయి ఒప్పుకుంటే ఆల్ హ్యాపీస్. ఒప్పుకొకపోతే కథ మరో విధంగా ఉంటుంది. ఇండియాలో అయితే నేటితరం యువత లవ్ అర్థాన్ని పూర్తిగా మార్చేశారు. తన ప్రేమను అంగీకరించకపోతే చచ్చిపోతా అని బెదరించడంతో పాటు చంపేందుకు సైతం కొందరు వెనకాడటం లేదు. మరి అబ్బాయిలంతా కాకపోయినా.. అమ్మాయిలు సైతం నేడు ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారనడంలో అతిశయోక్తి లేదు. మరికొన్ని ప్రేమ కథలు మాత్రం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటాయి. ఈ విషయంలో చాలా మంది అబ్బాయిలు జైలుకు పోయిన సందర్భాలు కోకొల్లలు.

సరిగ్గా ఇలాంటి ఘటనే దుబాయ్‌లో చోటుచేసుకుంది. అయితే, రోటిన్‌కు భిన్నంగా ఇక్కడ యువతి జైలుకు వెళ్లింది. అది కూడా ప్రేమించుకుని ఒకరినొకరు మోసం చేసుకున్న ఘటనో.. వేరే ఇతరులు తన మీద కేసు పెడితేనో కాదు. ఓ వ్యక్తి నువ్వు నాకు నచ్చావ్ (I love u) అని ప్రపోజ్ చేయగా.. అందుకు ఆమె ఇచ్చిన రిప్లైనే కటకటాల పాలు చేసినట్లు తెలుస్తోంది. బేసిగ్గా యునైటైడ్ కింగ్‌డమ్(UK) చెందిన ఓ యువతికి దుబాయ్‌లో జాబ్ వచ్చింది. అక్కడే ఉంటున్న ఆమెకు గత అక్టోబర్ నెలలో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. ఇద్దరు ఫోన్ నెంబర్స్ షేర్ చేసుకున్నారు. ఓ ఫైన్ డే అతను వాట్సాప్‌లో ఆమెకు లవ్ ప్రపోజల్ పెట్టాడు. దానికి (F**K YOU) అని ఆ యువతి రిప్లై ఇచ్చింది. దాంతో అతను దుబాయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడి చట్టాల ప్రకారం.. వ్యక్తిగత దూషణను నేరంగా భావించిన కోర్టు ఆ లేడికి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ క్రమంలోనే యూకేకు తిరుగు ప్రయాణమైన ఆమెను ఎయిర్ పోర్టు పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తనపై నేరారోపణ రుజువైన కారణంగా దుబాయ్‌ను విడిచి వెళ్లడానికి వీలులేదని నిర్భంధించారు. ప్రస్తుతం ఆ యువతి జైలు శిక్ష అనుభవిస్తోంది. కాగా, లవ్ ప్రపోజల్‌ను అంగీకరించడం, తిరస్కరించడం అమ్మాయిల హక్కు. కానీ, వ్యక్తిగతంగా దూషించడాన్ని దుబాయ్ చట్టాలు నేరంగా పరిగణించడం వల్లే ఆమెకు ఈ దుస్థితి వచ్చిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News