ఫుడ్ డెలివరీ చేసేందుకు అంతరిక్షంలోకి.. అందులో ఏమున్నాయ్..

దిశ, డైనమిక్ బ్యూరో : ఆకలేస్తే వంట వండే రోజుల నుంచి ఆన్లైన్‌లో ఆర్డర్స్ చేసుకుని తిందామనుకుంటున్న కాలమిది. ఆర్డర్ చేసిన కొద్దిసేపటికే వేడివేడిగా ఆహారాన్ని అందిస్తుండటంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీపై ప్రజల్లో మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోన్న ఫుడ్ డెలివరీ యాప్స్ ఇప్పుడు అన్ని పట్టణాలు, నగరాలకు విస్తరించాయి. అయితే, ఫుడ్ డెలివరీ సంస్థ ఊబర్ ఈట్స్ తన ఫుడ్ డెలివరీని విశ్వవ్యాప్తం చేశామనడానికి ప్రతీకగా అంతరిక్షంలోకి ఫుడ్ […]

Update: 2021-12-17 06:02 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ఆకలేస్తే వంట వండే రోజుల నుంచి ఆన్లైన్‌లో ఆర్డర్స్ చేసుకుని తిందామనుకుంటున్న కాలమిది. ఆర్డర్ చేసిన కొద్దిసేపటికే వేడివేడిగా ఆహారాన్ని అందిస్తుండటంతో ఆన్లైన్ ఫుడ్ డెలివరీపై ప్రజల్లో మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోన్న ఫుడ్ డెలివరీ యాప్స్ ఇప్పుడు అన్ని పట్టణాలు, నగరాలకు విస్తరించాయి. అయితే, ఫుడ్ డెలివరీ సంస్థ ఊబర్ ఈట్స్ తన ఫుడ్ డెలివరీని విశ్వవ్యాప్తం చేశామనడానికి ప్రతీకగా అంతరిక్షంలోకి ఫుడ్ డెలివరీ చేసింది. దీనికి సంబంధించిన వీడియాను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఇలా అంతరిక్షంలోకి ఫుడ్ డెలివరీ చేసిన మొదటి ఫుడ్ డెలివరీ సంస్థగా ఊబర్ ఈట్స్ రికార్డు సృష్టించింది. అయితే, ఇది జపాన్‌లో జరిగింది. జపాన్‌కు చెందిన వ్యాపారవేత్త స్పేస్ ట్రిప్‌కు వెళ్లగా.. అతనికి ఫుడ్ డెలివరీ చేసేందుకు ఊబర్ ఈట్స్ డెలివరీ బాయ్ 9 గంటల పాటు ప్రయాణించి పార్సిల్‌ను అందించాడు. అయితే, వారి కస్టమర్ స్వీట్ సాస్‌తో వండిన బీఫ్, మిసో పేస్ట్‌లో ఉడికించిన చేపలు,​బ్యాంబూ షూట్స్‌తో వండిన చికెన్, బ్రేయిస్డ్​ పోర్క్‌లు ఆర్డర్ చేసినట్లు ఊబర్ ఈట్స్ తెలిపింది.

Tags:    

Similar News