పారిస్ ఒప్పందం నుంచి అమెరికా నిష్క్రమణ

న్యూఢిల్లీ: పర్యావరణ మార్పును నియంత్రించడానికి చేసుకున్న పారిస్ ఒప్పందం నుంచి అమెరికా బుధవారం నిష్క్రమించింది. భూతాపానికి కళ్లెం వేయడానికి 2015లో కుదిరిన పారిస్ ఒప్పందం ద్వారా తమ దేశం నష్టపోతున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుసార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. 2017లో ఈ ఒప్పందం నుంచి వైదొలగబోతున్నట్టు నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే, ఈ ఒప్పందం నుంచి నిష్క్రమణ ప్రక్రియ ప్రకారం, అమెరికా అధ్యక్ష ఎన్నిక జరిగిన తర్వాతి రోజే అధికారికంగా ఆ దేశం బయటికి వచ్చినట్టుగా […]

Update: 2020-11-04 11:34 GMT

న్యూఢిల్లీ: పర్యావరణ మార్పును నియంత్రించడానికి చేసుకున్న పారిస్ ఒప్పందం నుంచి అమెరికా బుధవారం నిష్క్రమించింది. భూతాపానికి కళ్లెం వేయడానికి 2015లో కుదిరిన పారిస్ ఒప్పందం ద్వారా తమ దేశం నష్టపోతున్నదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలుసార్లు ఆరోపించిన సంగతి తెలిసిందే. 2017లో ఈ ఒప్పందం నుంచి వైదొలగబోతున్నట్టు నిర్ణయాన్ని వెల్లడించారు. అయితే, ఈ ఒప్పందం నుంచి నిష్క్రమణ ప్రక్రియ ప్రకారం, అమెరికా అధ్యక్ష ఎన్నిక జరిగిన తర్వాతి రోజే అధికారికంగా ఆ దేశం బయటికి వచ్చినట్టుగా ఖరారుచేసే నిబంధన ఉన్నది. అందుకే, అమెరికా బుధవారం ఈ ఒప్పందం నుంచి అధికారికంగా పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగినట్టుగా వెల్లడించారు.

Tags:    

Similar News