ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతి

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సోమవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కాలేపాల్ – కాకారి అడవుల్లో డీఆర్‌జీ బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోరాహోరీ కాల్పుల అనంతరం సంఘటన ప్రాంతంలో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే మృతుల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి మృతుల్లో ఒకరు అరన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిథిలోని జబెలి గ్రామ నివాసి, మల్కన్‌గిరి ఏరియా కమిటీ […]

Update: 2020-12-28 22:21 GMT

దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సోమవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కాలేపాల్ – కాకారి అడవుల్లో డీఆర్‌జీ బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హోరాహోరీ కాల్పుల అనంతరం సంఘటన ప్రాంతంలో ఇద్దరు మహిళా మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అయితే మృతుల వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి మృతుల్లో ఒకరు అరన్‌పూర్ పోలీస్‌స్టేషన్ పరిథిలోని జబెలి గ్రామ నివాసి, మల్కన్‌గిరి ఏరియా కమిటీ మెంబర్, మిలటరీ ఇంటిలిజెన్స్ హెడ్ ఐతే మండవిగా, మరొకరు పామేడు గ్రామ నివాసి, మల్కన్‌గిరి ఏరియా మిలటరీ ఇంటలిజెన్స్ మెంబర్ విజ్జె మర్కమ్‌గా పోలీసులు భావిస్తున్నారు. అయితే మండవిపై రూ 5 లక్షలు, విజ్జె మర్కమ్‌పై రూ 2 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసువర్గాలు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ స్థలంలో 1 పిస్టల్, 1 మజిల్ లోడింగ్ రైఫిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags:    

Similar News