ప్రాజెక్టులో మునిగి ఇద్దరు విద్యార్థులు మృతి
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాది కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టులోకి దిగిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన దుమ్ముగూడెం మండలం గుబ్బలమంగి ప్రాజెక్టులో శుక్రవారం చోటుచేసుకుంది. తాటివారి గూడెం గ్రామానికి చెందిన గొంది కిరణ్, జిన్నాలగూడెంకి చందిన పోడియం రవికుమార్ ఇద్దరు ప్రాజెక్టు వద్దకు స్నేహితులతో కలసి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టులోకి దిగిన ఇద్దరు నీట మునిగిపోయారు. స్నేహితులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. కొద్ది సమయం తర్వాత ఇద్దరి మృతదేహాలు […]
దిశ ప్రతినిధి, ఖమ్మం: భద్రాది కొత్తగూడెం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రాజెక్టులోకి దిగిన ఇద్దరు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన దుమ్ముగూడెం మండలం గుబ్బలమంగి ప్రాజెక్టులో శుక్రవారం చోటుచేసుకుంది. తాటివారి గూడెం గ్రామానికి చెందిన గొంది కిరణ్, జిన్నాలగూడెంకి చందిన పోడియం రవికుమార్ ఇద్దరు ప్రాజెక్టు వద్దకు స్నేహితులతో కలసి వెళ్లారు. ఈ క్రమంలోనే ప్రాజెక్టులోకి దిగిన ఇద్దరు నీట మునిగిపోయారు. స్నేహితులు గాలించినా ఫలితం లేకుండా పోయింది. కొద్ది సమయం తర్వాత ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.