ప్రియుడి ముందే పోలీసుల అత్యాచారం

ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే రాక్షసత్వం ప్రదర్శించారు. ఏకంగా ప్రియుడి ముందే ప్రియురాలిపై అత్యాచారం చేశారు. ఈ అమానుష ఘటన తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పుదుచ్చేరిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాళ్లోకి వెళితే.. సాధాణంగా పుదేచ్చేరికి ఎక్కువగా ప్రేమ జంటలు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి కడలూరు ప్రాంతానికి చెందిన రెండు ప్రేమ జంటలు పుదుచ్చేరిలో పర్యటించి.. అక్కడే బస చేశారు. అదే సమయంలో విధుల నిమిత్తం ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు సతీష్ కుమార్, సురేశ్ […]

Update: 2020-03-14 22:18 GMT

ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే రాక్షసత్వం ప్రదర్శించారు. ఏకంగా ప్రియుడి ముందే ప్రియురాలిపై అత్యాచారం చేశారు. ఈ అమానుష ఘటన తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పుదుచ్చేరిలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాళ్లోకి వెళితే.. సాధాణంగా పుదేచ్చేరికి ఎక్కువగా ప్రేమ జంటలు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం రాత్రి కడలూరు ప్రాంతానికి చెందిన రెండు ప్రేమ జంటలు పుదుచ్చేరిలో పర్యటించి.. అక్కడే బస చేశారు. అదే సమయంలో విధుల నిమిత్తం ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు సతీష్ కుమార్, సురేశ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.

ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు ప్రేమికులు ఉన్న గదుల వద్దకు తనిఖీల పేరుతో వచ్చారు. ఒక జంట ఉన్న గదిలోకి వెళ్లి వారి వ్యవహారం కుటుంబీకులకు చెబుతామంటూ బెదిరించారు. దీంతో రూ. 20 వేల నగదు ఇచ్చిన ప్రేమికులు తప్పించుకున్నారు. మరొకరు డబ్బులు లేవని చెప్పినా.. బతిమాలినా.. వినకుండా ప్రియుడి కళ్ల ముందే ప్రియురాలిపై ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారం చేశారు. అనంతరం భయంతో బాధిత యువతీ, యువకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, వ్యవహారం బట్టబయలు కావడంతో నిందితులను విధుల నుంచి తొలగిస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై ప్రత్యేక బృందం విచారణ మొదలుపెట్టింది.

Tags: rape case, police constable, Puducherry, suspend

Tags:    

Similar News