ఘోర రోడ్డు ప్రమాదం.. బావ బామ్మర్ది బలి

దిశ‌, న‌ర్సాపూర్: నర్సాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో, బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే చిలిపి జెడ్ మండలం ఫైజాబాద్ గ్రామానికి చెందిన మురళి కొల్చారం (32)మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన రాము(26) ఇద్దరూ క‌లిసి పల్సర్ బైక్ పై నర్సాపూర్ నుంచి మెదక్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో పెద్ద చింతకుంట గేట్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఆటో […]

Update: 2021-08-15 06:21 GMT

దిశ‌, న‌ర్సాపూర్: నర్సాపూర్ సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో, బైక్ ఢీకొన్న సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే చిలిపి జెడ్ మండలం ఫైజాబాద్ గ్రామానికి చెందిన మురళి కొల్చారం (32)మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన రాము(26) ఇద్దరూ క‌లిసి పల్సర్ బైక్ పై నర్సాపూర్ నుంచి మెదక్ వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలో పెద్ద చింతకుంట గేట్ సమీపంలోకి రాగానే ఎదురుగా వస్తున్న ఆటో బైక్ ను బలంగా ఢీ కొట్టడంతో మురళి, రాములు ఎగిరిరోడ్డుపై కింద‌ప‌డి అక్కడికక్కడే మృతి చెందారు. విష‌యం తెలుసుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చెరుకొని వివ‌రాలు అడిగి తెలుసుకొని మృత దేహాల‌ను న‌ర్సాపూర్ ప్రభుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే ముర‌ళీకి రాము వ‌ర‌స‌కు బావ‌మ‌రిది అవుతాడు. ఇద్దరు చ‌నిపోవ‌డంతో ఫైజాబాద్ గ్రామంతో పాటు ఘ‌న‌పూర్ గ్రామంలో విషాదఛాయ‌లు అలుముకున్నాయి.

Tags:    

Similar News