కుక్కను అతను కొట్టాడు.. జైలుకు వీళ్లద్దరూ పోయారు!

దిశ, ఆదిలాబాద్: కుక్కను అతను కొట్టాడు.. వీళ్లద్దరూ జైలుకు పోయారు! అవును… కుక్క పంచాయతీ ఇద్దరు వ్యక్తులను జైలుకు పంపేలా చేసింది. వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా కేంద్రంలోని ధ్యాగవాడ పరమేశ్వర్, సయ్యద్ అస్లం అనే ఈ ఇద్దరూ ఇరుగుపొరుగు కుటుంబాలు. పరమేశ్వర్ ఇంట్లో పెంపుడు కుక్క ఉంది. కాగా అస్లం కుటుంబానికి చెందిన ఏడేళ్ల బాలుడు కుక్కను బండరాయితో కొట్టడంతో అది గట్టిగా మొరిగింది. దీంతో భయపడిన ఆ బాలుడు పరిగెడుతూ కింద పడ్డాడు. బాలుడికి […]

Update: 2020-06-17 01:26 GMT

దిశ, ఆదిలాబాద్: కుక్కను అతను కొట్టాడు.. వీళ్లద్దరూ జైలుకు పోయారు! అవును… కుక్క పంచాయతీ ఇద్దరు వ్యక్తులను జైలుకు పంపేలా చేసింది. వివరాల్లోకి వెళితే… నిర్మల్ జిల్లా కేంద్రంలోని ధ్యాగవాడ పరమేశ్వర్, సయ్యద్ అస్లం అనే ఈ ఇద్దరూ ఇరుగుపొరుగు కుటుంబాలు. పరమేశ్వర్ ఇంట్లో పెంపుడు కుక్క ఉంది. కాగా అస్లం కుటుంబానికి చెందిన ఏడేళ్ల బాలుడు కుక్కను బండరాయితో కొట్టడంతో అది గట్టిగా మొరిగింది. దీంతో భయపడిన ఆ బాలుడు పరిగెడుతూ కింద పడ్డాడు. బాలుడికి గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. కుక్క కారణంగానే తమ కొడుకు ఆస్పత్రి పాలయ్యాడన్న కోపంతో సయ్యద్ అస్లం, సయ్యద్ ఆలం సోదరులు పరమేశ్వర్ ఇంటికి వెళ్లి గొడవ పడ్డారు. ఒక దశలో గొడవ పెరిగిపోయి… వారిద్దరూ పరమేశ్వర్ ఇంట్లోకి చొరబఢ్ఢారు. ఇంట్లో ఉన్న సామాన్లను చిందరవందర చేశారు. దీంతో పరమేశ్వర్ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీసులు అస్లం, ఆలంలపై కేసు నమోదు చేశారు. వీరిద్దరిని రిమాండ్ పై ఆదిలాబాద్ జైలుకు పంపినట్లు సీఐ జాన్ దివాకర్ తెలిపారు.

Tags:    

Similar News