కోల్‌కతాలో మరో ఇద్దరికి కరోనా

          పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మరో ఇద్దరికి కరోనావైరస్ సోకింది. బ్యాంకాక్ నుంచి కోల్‌కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా సోకినట్టు ఎయిర్‌పోర్టు అధికారులు గురువారం ధృవీకరించారు. వీరిరువురిని బేలియాఘాటా ఐడీ ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు. ఇటీవలే ఈ ఎయిర్‌పోర్టులో ఒక కరోనా పాజిటివ్ కేసును గుర్తించిన విషయం తెలిసిందే. కాగా, న్యూఢిల్లీలో బ్యాంకాక్-ఢిల్లీ ఆన్‌బోర్డులో ఉన్న ఒకరికి ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో […]

Update: 2020-02-13 05:44 GMT

పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో మరో ఇద్దరికి కరోనావైరస్ సోకింది. బ్యాంకాక్ నుంచి కోల్‌కతాలోని సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా సోకినట్టు ఎయిర్‌పోర్టు అధికారులు గురువారం ధృవీకరించారు. వీరిరువురిని బేలియాఘాటా ఐడీ ఆస్పత్రికి తరలించినట్టు వివరించారు. ఇటీవలే ఈ ఎయిర్‌పోర్టులో ఒక కరోనా పాజిటివ్ కేసును గుర్తించిన విషయం తెలిసిందే. కాగా, న్యూఢిల్లీలో బ్యాంకాక్-ఢిల్లీ ఆన్‌బోర్డులో ఉన్న ఒకరికి ఈ వైరస్ లక్షణాలు కనిపించడంతో అబ్జర్వేషన్‌లో ఉంచారు. జపాన్ తీరంలోని నౌకలో ఇద్దరు భారతీయులకు ఈ వైరస్ సోకినట్టు వార్తలు వచ్చిన తర్వాతి రోజే కోల్‌కతాలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News