ఐపీఎల్ నుంచి ఇద్దరు బౌలర్లు ఔట్
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్13లో మరో ఇద్దరు ఆటగాళ్లు దూరం కానున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫేస్ బౌలర్ తొడకండరాలు పట్టేయడంతో జట్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. మొన్నటి చెన్నై మ్యాచ్‌లో బౌలింగ్ వేస్తూ కుప్పకూలిన భువనేశ్వర్‌కు తొడ కండరాలు పట్టేసినట్టు తేలింది. దీంతో బౌలింగ్ వేసేందుకు వీలుండదని సంబంధిత కోచ్‌లు చెప్పారు. దీంతో భువి జట్టుకు దూరం కానున్నాడు. ఇప్పటికే మిచేల్ మార్శ్ గాయం కారణంగానే జట్టుకు దూరం కాగా.. మరో కీలక బౌలర్ జట్టు నుంచి […]
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ సీజన్13లో మరో ఇద్దరు ఆటగాళ్లు దూరం కానున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫేస్ బౌలర్ తొడకండరాలు పట్టేయడంతో జట్టు నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. మొన్నటి చెన్నై మ్యాచ్‌లో బౌలింగ్ వేస్తూ కుప్పకూలిన భువనేశ్వర్‌కు తొడ కండరాలు పట్టేసినట్టు తేలింది. దీంతో బౌలింగ్ వేసేందుకు వీలుండదని సంబంధిత కోచ్‌లు చెప్పారు. దీంతో భువి జట్టుకు దూరం కానున్నాడు. ఇప్పటికే మిచేల్ మార్శ్ గాయం కారణంగానే జట్టుకు దూరం కాగా.. మరో కీలక బౌలర్ జట్టు నుంచి వచ్చేయడంతో సన్‌రైజర్స్ కు ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ స్పిన్నర్ అమిత్ మిశ్రా కూడా గాయంతో పూర్తిగా IPL నుంచి నిష్క్రమించనున్నాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్ లో బల్ పట్టబోయిన మిశ్రా చేతి వేలికి గాయం చేసుకున్నాడు. దీంతో కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసి మైదానం వీడాడు. ఆ తర్వాత కూడా గాయం మానకపోవడంతో మొత్తానికే టోర్నీ నుంచి నిష్క్రమించనున్నాడు. మంచి ఫామ్‌లో కొనసాగుతున్న ఢిల్లీ కీలక స్పిన్నర్‌ను కోల్పోవడంతో నిరుత్సాహం చెందుతున్నారు.