చరాస్ డ్రగ్స్ విక్రయం.. ఇద్దరి అరెస్టు!
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో మాదక ద్రవ్యాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొందరు అక్రమార్కులు కాసులకు కక్కుర్తిపడి గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ చలామణి చేస్తున్నారు. దీంతో అమాయక యువత డ్రగ్స్ మత్తులో మునిగి తేలుతున్నారు. గత కొంతకాలంగా మాదక ద్రవ్యాల సరఫరా ముఠాపై సీరియస్‌గా దృష్టి సారించిన పోలీసులు ఒక్కొక్కటిగా ఛేదిస్తున్నారు. తాజాగా నగరంలోని మంగళహాట్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న సూరజ్ సింగ్, లలిత్ కుమార్‌లను అరెస్టు చేశారు. వారి […]
దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్ మహానగరంలో మాదక ద్రవ్యాల వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొందరు అక్రమార్కులు కాసులకు కక్కుర్తిపడి గుట్టుచప్పుడు కాకుండా డ్రగ్స్ చలామణి చేస్తున్నారు. దీంతో అమాయక యువత డ్రగ్స్ మత్తులో మునిగి తేలుతున్నారు. గత కొంతకాలంగా మాదక ద్రవ్యాల సరఫరా ముఠాపై సీరియస్‌గా దృష్టి సారించిన పోలీసులు ఒక్కొక్కటిగా ఛేదిస్తున్నారు.
తాజాగా నగరంలోని మంగళహాట్‌లో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. నిషేధిత డ్రగ్స్ విక్రయిస్తున్న సూరజ్ సింగ్, లలిత్ కుమార్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి నిషేధిత చరాస్ డ్రగ్స్‌ను టాస్క్‌ఫోర్సు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 10 గ్రాముల డ్రగ్స్‌ను రూ.1800లకు అమ్ముతున్నట్లు విచారణలో వెల్లడైందని చెప్పారు.