నిషేధిత గుట్కా ప్యాకెట్స్ లభ్యం.. ఇద్దరి అరెస్టు

దిశ, ఖమ్మం రూరల్​ : ఖమ్మం రూరల్‌లో వేర్వేరు చోట్ల పోగాకు ఉత్పత్తులైన విమల్, గుట్కా ప్యాకెట్లను పోలీసులకు పట్టుకున్నారు. రూరల్​ ఏసీపీ వెంకటరెడ్డి కథనం ప్రకారం.. గిస్కా నాయక్ తండాలో గుట్కా ప్యాకెట్స్ నిల్వలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచార మేరకు ఏసీపీ వెంకటరెడ్డి బృందం దాడులు నిర్వహించింది. ఇందులో రూ.35 వేల నిషేధిత గుట్కా ప్యాకెట్లతో పాటు ఎటువంటి అనుమతి లేని 29 లక్షల విలువ గల 119 బాక్సుల పోగాకు ఉత్పత్తుల విమల్ బాక్స్‌లను […]

Update: 2021-06-17 10:51 GMT

దిశ, ఖమ్మం రూరల్​ : ఖమ్మం రూరల్‌లో వేర్వేరు చోట్ల పోగాకు ఉత్పత్తులైన విమల్, గుట్కా ప్యాకెట్లను పోలీసులకు పట్టుకున్నారు. రూరల్​ ఏసీపీ వెంకటరెడ్డి కథనం ప్రకారం.. గిస్కా నాయక్ తండాలో గుట్కా ప్యాకెట్స్ నిల్వలు ఉన్నట్లు విశ్వసనీయ సమాచార మేరకు ఏసీపీ వెంకటరెడ్డి బృందం దాడులు నిర్వహించింది. ఇందులో రూ.35 వేల నిషేధిత గుట్కా ప్యాకెట్లతో పాటు ఎటువంటి అనుమతి లేని 29 లక్షల విలువ గల 119 బాక్సుల పోగాకు ఉత్పత్తుల విమల్ బాక్స్‌లను పట్టుకున్నారు.

నేరచరిత్ర కలిగిన జలగం నగర్‌కు చెందిన యాద భరత్‌కు ఈ ప్రొడక్ట్స్ చెందినవని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. విమల్ ప్యాకెట్లకు సంబంధించిన బిల్లులు GST, వాస్తవ వివరాలు తెలుసుకునేందుకు కమర్షియల్ ట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లు ఖమ్మం రూరల్ ఏసీపీ తెలిపారు. అదేవిధంగా తల్లంపాడు గ్రామానికి చెందిన పాత నేరస్ధుడు పుచ్చకాయల సురేష్ వద్ద రూ.15 వేల విలువ చేసే పోగాకు ఉత్పత్తులను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ వెంకటరెడ్డి వెల్లడించారు. వేర్వేరు కేసుల్లో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ సత్యనారాయణరెడ్డి తెలిపారు.

Tags:    

Similar News