పోకిమాన్ కార్డు కోసం రూ. 1.65 కోట్లు

దిశ, వెబ్‌డెస్క్: పోకిమాన్ కార్డులు సేకరించడం ఒక ఆసక్తికరమైన హాబీ. గత 25 ఏళ్లుగా ఈ జపనీస్ ఫ్రాంచైజీ కార్డుల సేకరణ మంచి బిజినెస్‌గా కూడా ఎదిగింది. వీటిని సేకరించే వారు అరుదైన కార్డుల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడరు. వాటిలో అత్యంత అరుదైన వాటికి కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టడమంటే నిజంగా అతిశయోక్తిగానే అనిపిస్తుంది. ఇప్పుడు అరుదైన ఒక పోకిమాన్ కార్డును దక్కించుకోవడానికి మాజీ ర్యాపర్, ట్విచ్ స్టార్ లాజిక్ […]

Update: 2020-10-12 07:05 GMT

దిశ, వెబ్‌డెస్క్: పోకిమాన్ కార్డులు సేకరించడం ఒక ఆసక్తికరమైన హాబీ. గత 25 ఏళ్లుగా ఈ జపనీస్ ఫ్రాంచైజీ కార్డుల సేకరణ మంచి బిజినెస్‌గా కూడా ఎదిగింది. వీటిని సేకరించే వారు అరుదైన కార్డుల కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడరు. వాటిలో అత్యంత అరుదైన వాటికి కోట్లలో డబ్బులు ఖర్చు పెట్టడమంటే నిజంగా అతిశయోక్తిగానే అనిపిస్తుంది. ఇప్పుడు అరుదైన ఒక పోకిమాన్ కార్డును దక్కించుకోవడానికి మాజీ ర్యాపర్, ట్విచ్ స్టార్ లాజిక్ ఏకంగా 2,26,000 డాలర్లు ఖర్చు పెట్టాడు. అంటే అటుఇటుగా రూ. 1.65 కోట్లు. ఇంతకీ ఆ పోకిమాన్ కార్డు ఏంటో చెప్పలేదు కదూ!

పోకిమాన్ మొదటి ఎడిషన్‌లో విడుదలైన చారిజార్డ్ కార్డు. నైనిటెండో, గేమ్ ఫ్రీక్ వారి పోకిమాన్ ఫ్రాంచైజీలోని ఈ చారిజార్డ్ కార్డును అట్సుకో నిషిడా రూపొందించాడు. అక్టోబర్ 9న నిర్వహించిన వేలంలో ఈ కార్డును దక్కించుకోవడానికి ఎంతోమంది పోకిమాన్ అభిమానులు, గేమర్‌లు పోటీ పడ్డారు. కానీ చివరకు ఆ కార్డును లాజిక్ గెలుచుకున్నట్లు వేలం నిర్వహించిన కార్డ్‌హాప్స్ సంస్థ ప్రకటించింది. దీనికి ముందు పోకిమాన్ కార్డుకు అత్యంత ఎక్కువ పలికిన ధర 50 వేల డాలర్లు. అంటే లాజిక్ పెట్టిన ఖర్చు అంచనాలు మించిపోయింది.

Tags:    

Similar News