క్షుద్రశక్తుల ప్రయోగమా..?

      పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడగా..మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా క్షుద్రశక్తుల ప్రయోగం వలనే తమ పిల్లలు చనిపోయారని వారి తల్లిదండ్రులు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. గజోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడంతాలి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమీప అడవిలోని విషపూరిత పండ్లను తినడం వల్లే చనిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో అనుమానం వ్యక్తం చేశారు. అయితే దర్యాప్తు కొనసాగుతోందని, ఇందుకు గల […]

Update: 2020-02-15 03:04 GMT

పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడగా..మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా క్షుద్రశక్తుల ప్రయోగం వలనే తమ పిల్లలు చనిపోయారని వారి తల్లిదండ్రులు ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది. గజోల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కడంతాలి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సమీప అడవిలోని విషపూరిత పండ్లను తినడం వల్లే చనిపోయి ఉంటారని పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో అనుమానం వ్యక్తం చేశారు. అయితే దర్యాప్తు కొనసాగుతోందని, ఇందుకు గల కారణం ఇంకా నిర్దారణ కాలేదని డీఎస్‌పీ అలోక్ రజోరియా తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న చిన్నారులను స్థానిక ఎమ్మెల్యే పరామర్శించి ఈ ఘటన గురించి మాట్లాడారు. అస్వస్థతకు గురైన పిల్లలను భూతవైద్యుల దగ్గరికి కాకుండా..డాక్టరు దగ్గరికి తీసుకెళ్తే బతికుండేవారని అన్నారు. అంతేకాకుండా ఇటువంటి మూఢనమ్మకాలను విశ్వసించకూడదని ప్రజలకు సూచించారు. కాగా దీనిపై నిజానిజాలు తేల్చేందుకు వైద్యుల బృందాన్ని ఆ గ్రామానికి పంపినట్టు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.

Tags:    

Similar News