ట్విట్టర్‌లో ‘టిప్ జార్’ ఫీచర్
దిశ, ఫీచర్స్: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్.. తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు కొత్తగా ‘టిప్ జార్’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఫేవరెట్ అకౌంట్స్‌తో పాటు ట్విట్టర్ కంటెంట్ క్రియేటర్స్, ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు నేరుగా డబ్బులు సెండ్ చేయొచ్చు. కాగా, టిప్ జార్‌ను ఉపయోగించి ఇన్‌ఫ్లూయెన్సర్స్ తాము పోస్ట్ చేస్తున్న సమాచారాన్ని క్యాష్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించింది ట్విట్టర్. ‘టిప్ జార్’ ఐకాన్ ట్విట్టర్ ఖాతాదారులకు మానిటైజేషన్ అవకాశాన్ని కల్పిస్తుండగా, […]
దిశ, ఫీచర్స్: మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్.. తన ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు కొత్తగా ‘టిప్ జార్’ అనే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ ఫేవరెట్ అకౌంట్స్‌తో పాటు ట్విట్టర్ కంటెంట్ క్రియేటర్స్, ఇన్‌ఫ్లూయెన్సర్స్‌కు నేరుగా డబ్బులు సెండ్ చేయొచ్చు. కాగా, టిప్ జార్‌ను ఉపయోగించి ఇన్‌ఫ్లూయెన్సర్స్ తాము పోస్ట్ చేస్తున్న సమాచారాన్ని క్యాష్ చేసుకునే సదుపాయాన్ని కూడా కల్పించింది ట్విట్టర్.
‘టిప్ జార్’ ఐకాన్ ట్విట్టర్ ఖాతాదారులకు మానిటైజేషన్ అవకాశాన్ని కల్పిస్తుండగా, ఈ ఫీచర్.. పాట్రియన్, పేపాల్, వెన్మో, క్యాష్ యాప్, బ్యాండ్ క్యాంప్ వంటి పేమెంట్ సేవలందించే ప్రొఫైల్ కలిగి ఉన్నవారికి సర్వీస్ అందిస్తుంది. కాగా ప్లాట్‌ఫామ్‌లో వినియోగదారులు స్వీకరించే టిప్స్‌కు ఎలాంటి కమీషన్ తీసుకోమని ట్విట్టర్ పేర్కొంది. ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌ను ఆంగ్లంలో ఉపయోగించే లిమిటెడ్ గ్రూప్ ప్రొఫైల్స్‌కు మాత్రమే ఈ ‘టిప్ జార్’ సదుపాయం ఉండగా, దీన్ని త్వరలోనే మరిన్ని భాషలకు విస్తరించాలని ట్విట్టర్ యోచిస్తోంది. ఎంపిక చేసిన క్రియేటర్స్, జర్నలిస్టులు, నిపుణులు, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజర్స్‌కు తమ ప్రొఫైల్‌లో టిప్ జార్ అవేలబుల్‌గా ఉండగా.. ఈ ఫీచర్ త్వరలోనే ఎక్కువ మంది వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.
ఇప్పటికే ఈ ఫీచర్‌ను పొందినవారు తమ ప్రొఫైల్ పేజీలోని ఫాలో బటన్ పక్కన ‘టిప్ జార్’ ఐకాన్‌ను చూడొచ్చు. దీనిపై క్లిక్ చేయగానే, లిస్ట్ ఆఫ్ పేమెంట్ సర్వీస్/లేదా ఈ సర్వీస్ అందుబాటులో ఉన్న ప్రొఫైల్స్ కనిపిస్తాయి. మీకు అందుబాటులో ఉన్న పేమెంట్ సర్వీస్ లేదా ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకోవాలి. లింక్‌పై క్లిక్ చేస్తే వినియోగదారుడు ఎంచుకున్న అకౌంట్/పేమెంట్ యాప్‌లోకి ఎంటర్ అవుతారు. అక్కడ టిప్ బార్‌ను చెల్లించవచ్చు.
‘ఫాలోస్, రీట్వీట్స్, లైక్స్‌కు మించి ఒకరికొకరు మద్దతిచ్చే సదుపాయాన్ని సులభతరం చేయాలని కంపెనీ కోరుకుంటోంది. అందుకే టిప్ జార్‌ను పరిచయం చేస్తున్నాం. ట్విట్టర్‌లో డబ్బును స్వీకరించడానికి, మద్దతివ్వడానికి ప్రజలకు కొత్త మార్గాలను అందించే వ్యవస్థలో ఇది మొదటి దశ’ అని ట్విట్టర్ పేర్కొంది.
https://twitter.com/Twitter/status/1390396166496522247