బీఫ్‌కు బదులు బీడీఎఫ్.. నెటిఫ్లిక్స్‌పై నెటిజన్ల ట్రోలింగ్

దిశ, ఫీచర్స్ : ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. తాజాగా సౌత్ ఇండియన్ మూవీస్, స్టోరీస్ కోసం స్పెషల్‌ స్పేస్ క్రియేట్ చేసేందుకు ట్విట్టర్‌లో ‘నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్’ బ్రాండ్ న్యూ పేజీ ఏర్పాటు చేయడంతో అన్ని వైపుల నుంచి అప్రిషియేషన్ అందుకున్నా.. రీసెంట్‌గా చేసిన పనిమాత్రం నెటిజన్ల ఆవేశానికి కారణమైంది. ‘నమ్మా స్టోరీస్’ పేరు గల సౌత్ ఇండియన్ ఆంథెమ్‌ను ట్విట్టర్ ద్వారా పరిచయం చేసిన నెట్‌ఫ్లిక్స్.. దానికి సంబంధించిన సబ్‌టైటిట్స్ […]

Update: 2021-07-11 03:54 GMT

దిశ, ఫీచర్స్ : ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ నెటిజన్ల ఆగ్రహానికి గురైంది. తాజాగా సౌత్ ఇండియన్ మూవీస్, స్టోరీస్ కోసం స్పెషల్‌ స్పేస్ క్రియేట్ చేసేందుకు ట్విట్టర్‌లో ‘నెట్‌ఫ్లిక్స్ ఇండియా సౌత్’ బ్రాండ్ న్యూ పేజీ ఏర్పాటు చేయడంతో అన్ని వైపుల నుంచి అప్రిషియేషన్ అందుకున్నా.. రీసెంట్‌గా చేసిన పనిమాత్రం నెటిజన్ల ఆవేశానికి కారణమైంది. ‘నమ్మా స్టోరీస్’ పేరు గల సౌత్ ఇండియన్ ఆంథెమ్‌ను ట్విట్టర్ ద్వారా పరిచయం చేసిన నెట్‌ఫ్లిక్స్.. దానికి సంబంధించిన సబ్‌టైటిట్స్ విషయంలో చేసిన పొరపాటు వల్ల నెగెటివ్ ట్రోల్స్‌ ఎదుర్కొంటోంది.

సౌత్ ఇండియాకు చెందిన నలుగురు ర్యాప్ ఆర్టిస్ట్స్ అరివు, సిరి, హనుమకిండ్, నీరజ్ మాధవ్‌‌‌ ఈ పాటలో కనిపించగా.. తమ మాతృభాష, ఫుడ్, కల్చర్‌‌ను సెలబ్రేట్ చేసుకునే విధానాన్ని చూపించారు. ప్రస్తుతం వైరల్‌గా మారిన సాంగ్‌‌లోని ‘పారొట్టెం బీఫం ఎంజన్ తిన్నం అత్తికాలత్తు(రోజూ పొద్దున్నే పరోటాతో బీఫ్ తింటాను)’ అనే లైన్‌ విషయంలో వివాదం తలెత్తింది. ఈ లిరిక్స్‌కు సంబంధించిన సబ్‌టైటిల్స్‌లో నెట్‌ఫ్లిక్స్ ‘బీఫ్’కు బదులుగా ‘బీడీఎఫ్’ డిస్‌ప్లే చేయడం పట్ల నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అయితే మలయాళీల ఫేవరెట్ డిష్- ‘బీఫ్ డ్రై ఫ్రై’ను షార్ట్ కట్‌గా ‘బీడీఎఫ్’ అని పిలుస్తుంటారు. కాగా మితవాద రాష్ట్రాల్లో గొడ్డు మాంసంపై అనేక రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలోనే.. తాజాగా నెట్‌ఫ్లిక్స్ కూడా ఆ పేరును డిస్‌ప్లే చేయడంలో వెనుకంజ వేయడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.

ఈ మేరకు మలయాళీ రైటర్ ఎన్‌ఎస్ మాధవన్.. మలయాళంలో సరిగ్గా రాసేముందు బీఫ్ స్పెల్లింగ్ నేర్చుకోండని నెట్‌ఫ్లిక్స్‌కు సలహా ఇస్తూ ట్వీట్ చేశారు. మరొక యూజర్ ‘సాంగ్ మొత్తం బాగుంది, కానీ సబ్‌టైటిల్స్‌లో బీఫ్‌‌ను ధైర్యంగా చెప్పలేని దశలో సౌత్ ఇండియా లేదు’ అన్నాడు. ఇంకా కొంతమంది ‘బీఫ్ స్పె్ల్లింగ్ రాసేందుకు మీరు రైట్ వింగ్స్‌కు భయపడతారేమో కానీ, మా అలవాట్లు మావి. కేరళలో మేము ఈ మాంసాన్ని ఇష్టపడతామని చెప్పుకునేందుకు సంకోచించం’ అంటూ ట్వీట్ చేస్తున్నారు. మొత్తానికైతే ‘బీఫ్’ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ మ్యూజిక్‌ను కార్తిక్ షా కంపోజ్ చేయగా సుపారి స్టూడియోస్ ప్రొడ్యూస్ చేసింది.

Tags:    

Similar News