Tiktokను కొనే యోచనలో ట్విట్టర్?
దిశ, వెబ్ డెస్క్: టిక్‌టాక్ (Tiktok)ను బ్యాన్ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసెందే. ఈ నేపథ్యంలోనే చైనా కంపెనీ అయిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ (byte dance) దానిని అమ్మేందుకు సిద్ధపడింది. ఈ విషయమై మైక్రోసాప్ట్ (microsoft) సంస్థతో బైట్ డ్యాన్స్ చర్చలు కూడా జరిపింది. ఈ క్రమంలోనే తాజాగా టిక్‌టాక్(Tiktok)ను కొనుగోలు చేసే యోచనలో ట్విట్టర్ (twitter) ఉన్నదనే కథనాలు వెలువడుతున్నాయి. కాగా, టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ సంస్థ […]
దిశ, వెబ్ డెస్క్: టిక్‌టాక్ (Tiktok)ను బ్యాన్ చేసేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసెందే. ఈ నేపథ్యంలోనే చైనా కంపెనీ అయిన టిక్‌టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ (byte dance) దానిని అమ్మేందుకు సిద్ధపడింది. ఈ విషయమై మైక్రోసాప్ట్ (microsoft) సంస్థతో బైట్ డ్యాన్స్ చర్చలు కూడా జరిపింది. ఈ క్రమంలోనే తాజాగా టిక్‌టాక్(Tiktok)ను కొనుగోలు చేసే యోచనలో ట్విట్టర్ (twitter) ఉన్నదనే కథనాలు వెలువడుతున్నాయి.
కాగా, టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ సంస్థ తప్ప మిగతా ఏ అమెరికన్ కంపెనీ కొనుగోలు చేసినా అందులో సగం వాటాను అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సిందేనని ట్రంప్ ఆదేశించారు. ఈ లాంటి నిబంధనల మధ్య ట్విట్టర్ ఈ ప్రక్రియను కొనసాగిస్తుందా లేదా అనేది చూడాలి. ఇదిలాఉండగా, ఈ విషయంపై అటు టిక్ టాక్ గానీ, ఇటు ట్విట్టర్ గానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని తెలుస్తోంది.