ఇంటి నుంచే ఉద్యోగం.. ట్విట్టర్ ఆదేశాలు!

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) విస్తరిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తమ ఉద్యోగులకు కీలకమైన ఆదేశాలను ఇచ్చింది. కరోనా అనేక దేశాలకు ప్రబలుతున్న కారణంగా ఉద్యోగులందరూ ఇంటి వద్ద నుంచే పని చేయాలని స్పష్టం చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట సుమారు ఐదు వేల మంది ఉద్యోగులకు ఈ ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగా జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ ఆదేశాలు ఇచ్చింది. […]

Update: 2020-03-03 01:05 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) విస్తరిస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తమ ఉద్యోగులకు కీలకమైన ఆదేశాలను ఇచ్చింది. కరోనా అనేక దేశాలకు ప్రబలుతున్న కారణంగా ఉద్యోగులందరూ ఇంటి వద్ద నుంచే పని చేయాలని స్పష్టం చేసింది. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట సుమారు ఐదు వేల మంది ఉద్యోగులకు ఈ ఆదేశాలు ఇచ్చినట్టు సమాచారం. ఇందులో భాగంగా జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్ ఆఫీసుల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇదివరకే ప్రయాణాలకు ఆంక్షలిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్ నిర్ణయాన్ని అమలు చేస్తోంది.

కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులందరూ ఇంటి వద్ద ఉండే పనిచేయడానికి అనుమతిస్తున్నట్టు ట్విటర్ ప్రకటించింది. జపాన్, హాంకాంగ్, దక్షిణ కొరియా దేశాల్లో ప్రభుత్వాలే ఆదేశాలివ్వడంతో ఇప్పటికే అక్కడి ఉద్యోగులందరూ ఇంటి నుంచే పనిచేస్తున్నారు.

Tags: corona virus effect, twitter, corona virus update, work from home

Tags:    

Similar News