సివిల్స్ ఆశావాహుల జీవితాన్ని ప్రతిబింబించే ‘ఆస్పిరెంట్స్’

దిశ, ఫీచర్స్ : కష్టాలు ఎన్ని ఎదురైనా.. అడుగడుగునా అవమానాలు వెక్కిరిస్తున్నా.. తోటి మిత్రులంతా లైఫ్‌లో సెటిల్ అవుతున్నా.. ‘ప్రభుత్వ ఉద్యోగం’ సాధించాలనే లక్ష్యం కోసం కొందరు యువకులు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తుంటారు. తమ జీవితాశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో కోల్పోయిన వాటికి అధైర్యపడకుండా, అవాంతరాలను ఆత్మవిశ్వాసంతో అధిగమించి ‘ఎగ్జామ్స్’ క్రాక్ చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇలాంటి ‘ఆస్పిరెంట్స్’‌కు హైదరాబాద్‌‌లోని అశోక్ నగర్ అడ్డా కాగా.. పశ్చిమ ఢిల్లీలోని ఓల్డ్ రజిందర్ నగర్ కూడా యూపీఎస్సీ ఆశావాదులకు కేరాఫ్‌గా నిలుస్తోంది. […]

Update: 2021-04-15 03:02 GMT

దిశ, ఫీచర్స్ : కష్టాలు ఎన్ని ఎదురైనా.. అడుగడుగునా అవమానాలు వెక్కిరిస్తున్నా.. తోటి మిత్రులంతా లైఫ్‌లో సెటిల్ అవుతున్నా.. ‘ప్రభుత్వ ఉద్యోగం’ సాధించాలనే లక్ష్యం కోసం కొందరు యువకులు అవిశ్రాంతంగా ప్రయత్నిస్తుంటారు. తమ జీవితాశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో కోల్పోయిన వాటికి అధైర్యపడకుండా, అవాంతరాలను ఆత్మవిశ్వాసంతో అధిగమించి ‘ఎగ్జామ్స్’ క్రాక్ చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లోని ఇలాంటి ‘ఆస్పిరెంట్స్’‌కు హైదరాబాద్‌‌లోని అశోక్ నగర్ అడ్డా కాగా.. పశ్చిమ ఢిల్లీలోని ఓల్డ్ రజిందర్ నగర్ కూడా యూపీఎస్సీ ఆశావాదులకు కేరాఫ్‌గా నిలుస్తోంది. టాప్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్, 24 × 7 లైబ్రరీలు, అందుబాటులో ఉండే ఉపాధ్యాయులు, స్టడీ మెటీరియల్.. వాట్ నాట్? వారి ప్రిపరేషన్‌కు సరిపడా వనరులన్నింటికీ అదే వేదిక. కాగా ఇలాంటి ఓ ముగ్గురు స్నేహితుల నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్ ‘ఆస్పిరెంట్స్- ప్రి, మెయిన్స్ ఔర్ లైఫ్’. అసలు ఈ కథ ఏంటి? ఈ సిరీస్ ఎక్కడ చూడాలి?

దేశం నలుమూలల నుంచి ఎంతోమంది యువకులు.. ఇండియాలోని టఫెస్ట్ కాంపిటీషన్ ఎగ్జామ్ ‘యూపీఎస్సీ’ని క్రాక్ చేసేందుకు ఢిల్లీలోని ఓల్డ్ రజిందర్ నగర్‌కు వస్తుంటారు. ఇదో భిన్న ప్రపంచం. దేశంతో పాటు తమ జీవితాలను మార్చుకునేందుకు ఇక్కడ కష్టపడుతుంటారు. అలాంటి సివిల్ సర్వీస్ ఆశావాదుల కలలకు, అనుభవాలకు దృశ్యరూపమే వైరల్ ఫీవర్ (టీవీఎఫ్) అందించిన ‘ఆస్పిరెంట్స్’ సిరీస్. ఇందులో నవీన్ కస్తూరియా, అభిలాష్ తప్లియల్, సన్నీ హిందూజా శివంకిత్ పరిహార్ నటించారు. ఈ షో.. పాస్ట్ అండ్ ప్రజెంట్ నేపథ్యంలో సాగుతుంది. చివరకు ముగ్గురు స్నేహితులు తమ ప్రయాణాన్ని మూడు భిన్న దారుల్లో ముగిస్తారు.

ఇక యాస్పిరెంట్స్ మొదటి ఎపిసోడ్ చూస్తుంటే.. ఐఐటి ప్రవేశ పరీక్షలో ఒత్తిడి గురించి చర్చించిన ‘కోటా ఫ్యాక్టరీ’ మాదిరిగానే సాగింది. ఇందులో యూపీఎస్సీ ఆశావాది అభిలాష్ (నవీన్ కస్తూరియా) కథను చెప్పారు. పరీక్షలో భాగంగా ఏ అంశాన్ని ఎంచుకోవాలో తేల్చుకోలేని సందేహంలో ఉంటాడు అతడు. అనుభవజ్ఞుడైన యూపీఎస్సీ విద్యార్థి సన్నీ హిందూజాతో చెప్పేంత వరకు.. తన స్నేహితుల (అభిలాష్ తప్లియల్, శివంకిత్ పరిహార్) నుంచి చాయ్‌వాలా వరకు దాదాపు అందరితోనూ ఎన్నుకోవలసిన ఐచ్ఛిక విషయం గురించి చర్చిస్తాడు. చిచోర్ మూవీ మాదిరిగానే, ఆస్పిరెంట్స్ ఫస్ట్ ఎపిసోడ్ రెండు టైమ్‌లైన్స్‌లో( లైఫ్‌లో స్థిరపడిన ఆ ముగ్గురు స్నేహితులను చూపిస్తూనే.. వారి సివిల్ ప్రిపరేషన్ రోజుల్లోని కష్టాన్ని, ఇష్టాన్ని చూపిస్తుంది) నడుస్తుంది. ఈ సిరీస్‌లో రెండో ఎపిసోడ్ ఏప్రిల్ 14న విడుదల కాగా, మరో ఎపిసోడ్ ఈ నెల మూడో వారంలో, 4వ ఎపిసోడ్ – మెయిన్స్, 5వ ఎపిసోడ్ – ఇంటర్వ్యూ ఆ తర్వాతి వారాల్లో విడుదలవనున్నాయి. కాగా ఈ సిరీస్‌ను యూట్యూబ్‌లో చూడొచ్చు.

 

Tags:    

Similar News